మద్యం మత్తులో కొడుకుతో గొడవ పడిన తండ్రి.. ఆ గొడవ ఎలాంటి దారుణానికి దారి తీసిందంటే..

ABN , First Publish Date - 2022-10-04T02:22:21+05:30 IST

ఆ వ్యక్తి మద్యానికి బానిస.. ప్రతిరోజూ తాగి ఇంటికి వెళ్లి కొడుకుతో గొడవ పడేవాడు..

మద్యం మత్తులో కొడుకుతో గొడవ పడిన తండ్రి.. ఆ గొడవ ఎలాంటి దారుణానికి దారి తీసిందంటే..

ఆ వ్యక్తి మద్యానికి బానిస.. ప్రతిరోజూ తాగి ఇంటికి వెళ్లి కొడుకుతో గొడవ పడేవాడు.. ఆదివారం కూడా ఎప్పటిలాగానే తాగి ఇంటికి వెళ్లి కొడుకుతో గొడవ పడ్డాడు.. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు.. తండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు.. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.. హర్యానాలోని పానిపట్ నగరంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Chennai: రోడ్డుపై అద్భుతమైన స్టంట్లతో అదరగొట్టిన యువకుడు.. ఆ తర్వాత సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే..


పానిపట్ నగరంలోని న్యూ వికాస్ నగర్‌లో రాజ్‌పాల్ (47) తన కొడుకుతో కలిసి నివసిస్తున్నాడు. రాజ్‌పాల్‌ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి కొడుకుతో గొడవపడేవాడు. రోజూలాగే ఆదివారం రాత్రి కూడా రాజ్‌పాల్ మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. కొడుకు సుమిత్‌తో గొడవకు దిగాడు. తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి తోపులాటకు దారితీసింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సుమిత్ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని రాజ్‌పాల్ ఛాతీలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రాజ్‌పాల్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read more