Shoeలో ముడుచుకొని పడుకున్న నాగు పాము...షూ వేసుకోబోతే పడగ విప్పి కాటు వేయబోయిన వీడియో వీక్షించండి

ABN , First Publish Date - 2022-07-12T14:50:14+05:30 IST

వర్షాకాలం ఆరంభంతో చెప్పుల స్టాండులో ఉన్న షూలో ఓ నాగుపాము ముడుచుకొని పడుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది...

Shoeలో ముడుచుకొని పడుకున్న నాగు పాము...షూ వేసుకోబోతే పడగ విప్పి కాటు వేయబోయిన వీడియో వీక్షించండి

వర్షాకాలం ఆరంభంతో చెప్పుల స్టాండులో ఉన్న షూలో ఓ నాగుపాము ముడుచుకొని పడుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది.తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది.వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది.చివరికి సదరు మహిళ పామును పాదరక్షల నుంచి బయటకు తీశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపామును  వీడియో తీసి ఈ చిన్న క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ‘‘జర జాగ్రత్త.నాగుపాములుంటే శిక్షణ పొందిన సిబ్బంది సహాయం తీసుకోండి’’ అంటూ సుశాంతనంద సూచించారు.


 షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లక్ష కంటే అధికంగా నెటిజన్లు వీక్షించడంతోపాటు 3,400 మంది లైక్ చేశారు.భయంకరమైన ఈ వీడియోను పంచుకున్నందుకు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.గత నెలలో కేరళలోని తన పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థిని విషపూరిత పాము కాటుకు గురైన విషయం తెలిసిందే. బాలుడిని తన తరగతి గదికి 200 మీటర్ల దూరంలో పాములు కరిచాయి. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని ఆ తర్వాత వార్తలు వచ్చాయి.మొత్తంమీద వర్షాకాలం రావడంతో పాములుంటాయి... పారాహుషార్ అంటున్నారు అటవీశాఖ అధికారులు...తస్మాత్ జాగ్రత్త.




Updated Date - 2022-07-12T14:50:14+05:30 IST