Viral News: 23ఏళ్లపాటు సింగిల్‌గా ఉన్నా.. ఇక నా వల్ల కాదు.. నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ యువకుడి ప్రకటన!

ABN , First Publish Date - 2022-10-05T17:25:25+05:30 IST

టీనేజీలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ యువకుడు.. ఓ తోడు కోసం వేట ప్రారంభించాడు. ఎన్నో డేటింగ్ యాప్‌లు సందర్శించాడు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి మరెన్నో ప్రయోగాలు చేశాడు. కానీ అవన్ని వర్కౌట్ కాలేదు. చూస్తుండగానే 20ఏళ్లలోకి అడుగుపె

Viral News: 23ఏళ్లపాటు సింగిల్‌గా ఉన్నా.. ఇక నా వల్ల కాదు.. నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ యువకుడి ప్రకటన!

ఇంటర్నెట్ డెస్క్: టీనేజీలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ యువకుడు.. ఓ తోడు కోసం వేట ప్రారంభించాడు. ఎన్నో డేటింగ్ యాప్‌లు సందర్శించాడు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి మరెన్నో ప్రయోగాలు చేశాడు. కానీ అవన్ని వర్కౌట్ కాలేదు. చూస్తుండగానే 20ఏళ్లలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే 23వ పుట్టిన నోజు వేడుకలు కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఏకంగా ప్రకటననే విడుదల చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌కు చెందిన 23ఏళ్ల ఎడ్ చప్మన్(Ed Chapman) ‘డేటింగ్ చేయడానికి నాకొక గాళ్‌ఫ్రెండ్ కావాలి. ఆసక్తిగల అమ్మాయిలు కింద ఇచ్చిన మెయిల్ ద్వారా సంప్రదించండి’ అంటూ ప్రకటన విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ప్రకటనకు సంబంధించిన బిల్‌బోర్డులు బ్రిటన్‌లోని కొన్ని ఏరియాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యువకుడు స్పందించాడు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, డేటింగ్ యాప్‌లలో గాళ్‌ఫ్రెండ్ కోసం వెతికినట్టు చెప్పాడు. అయినా ఫలితం లేకపోవడంతో.. ప్రకటన ఇచ్చినట్టు స్పష్టం చేశాడు. 23ఏళ్లపాటు సింగిల్‌గా ఉన్నానని.. ఇక అలా ఉండటం తన వల్ల కాదన్నాడు. కాగా..  ఎడ్ చప్మన్‌కు సంబంధించిన ప్రకటన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 


Updated Date - 2022-10-05T17:25:25+05:30 IST