Viral Viedo: షార్క్‌తో ఓవర్ యాక్షన్ చేస్తే అట్లే ఉంటది మరి!

ABN , First Publish Date - 2022-07-21T20:51:15+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అది చూసి కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. షార్క్ వంటి సముద్ర జీవులతో జాగ్రత్తగా ఉండాలని కొందరు కామెంట్ చేస్తే

Viral Viedo: షార్క్‌తో ఓవర్ యాక్షన్ చేస్తే అట్లే ఉంటది మరి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అది చూసి కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. షార్క్ వంటి సముద్ర జీవులతో జాగ్రత్తగా ఉండాలని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరేమో ఓవర్ యాక్షన్ చేస్తే అట్లే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఓ వ్యక్తి కొంత మందితో కలిసి సముద్రంలోకి బోటుపై విహారానికి వెళ్లాడు. అనంతరం బోటును ఓ దగ్గర నిలిపేసి.. అక్కడ కనిపించిన చిన్న షార్క్ చేప పిల్లతో ఓవర్ యాక్షన్ చేశాడు. దాన్ని పట్టుకుని నీటిలో అటూ ఇటూ తిప్పబోయాడు. దీంతో దానికి కోపం వచ్చి.. అతడి చేతిని కొరికేసింది. ఎలాగోలా దాని నుంచి చేతిని లాగేసుకున్న అతడు.. తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-07-21T20:51:15+05:30 IST