ఇంటి నుండి పారిపోయిన ప్రేమికులకు ఆశ్రయం కల్పించే విచిత్ర అలయం... ఎక్కడుందో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-23T15:20:33+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ పర్యాటక పరంగా అద్భుతమైన...

ఇంటి నుండి పారిపోయిన ప్రేమికులకు ఆశ్రయం కల్పించే విచిత్ర అలయం... ఎక్కడుందో తెలుసా?

హిమాచల్ ప్రదేశ్ పర్యాటక పరంగా అద్భుతమైన రాష్ట్రం. ఇక్కడి అందమైన హిల్ స్టేషన్లు అందరినీ ఆకర్షిస్తాయి. ఇంతే కాకుండా ఈ రాష్ట్రం అనేక పురాతన దేవాలయాలకు నిలయం. ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. జ్వాలా దేవి టెంపుల్, నైనా దేవి టెంపుల్, మా హిడింబా టెంపుల్, జఖూ టెంపుల్ వంటి అనేక పురాతన దేవాలయాలతో పాటు ఒక ప్రత్యేక దేవాలయం కూడా ఉంది. ఇది ప్రేమికులకు ఆశ్రయం కల్పిస్తుంది. ఈ ఆలయం కులులోని షాంగఢ్ గ్రామంలో ఉంది. షాంఘడ్ గ్రామ దేవత షాంగ్చుల్ మహాదేవ్. ఇంటి నుండి పారిపోయి వచ్చే ప్రేమికులు ఈ ఆలయంలో ఆశ్రయం పొందుతారు. ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని చెబుతారు. 


ఈ ఆలయంలో ఆశ్రయం పొందిన ప్రేమికులకు వారి కుటుంబ సభ్యులు లేదా పోలీసులు కూడా ఎవరూ కూడా హాని చేయరని అంటారు. షాంగడ్ గ్రామంలో ప్రేమ జంటలకు చాలా ఆతిథ్యం ఇస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పారిపోయి వచ్చిన ప్రేమికులు భద్రత కోసం ఈ ఆలయానికి చేరుకుంటారని చెబుతారు. ఆలయ నిర్వాహకులు వారికి ఇక్కడ బసతోపాటు భోజన ఏర్పాట్లు చేస్తారు. షాంగడ్ గ్రామ ప్రజలు కూడా వారికి ఆతిథ్యం ఇస్తారు. ఆలయ పరిసరాల్లో పోలీసుల రాకపోకలను కూడా నిషేధించారు. ఈ గ్రామంలోని వారు కొట్లాటకు దూరంగా ఉంటారు. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు వారు ఈ గ్రామానికి వచ్చారని, అప్పుడు ఈ  గ్రామస్థులు వారికి ఆశ్రయం ఇచ్చారని స్థానికులు చెబుతుంటారు. కౌరవులు వారిని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నప్పుడు షాంగ్చుల్ మహాదేవ్ వారిని గ్రామానికి రాకుండా అడ్డుకుని, రక్షించారని అంటారు. కాగా 2015లో అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆలయంతో పాటు 3 ఇళ్లలో 20 విగ్రహాలు సహా మంటలు చెలరేగాయి. దీంతో తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించారు. 

Updated Date - 2022-02-23T15:20:33+05:30 IST