కోరలు చాచిన మరో మహమ్మారి... 48,500 ఏళ్లనాటి వైరస్‌ను తట్టిలేపిన శాస్త్రవేత్తలు...

ABN , First Publish Date - 2022-11-30T11:06:53+05:30 IST

ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కరోనాకు మించిన ఘోర పరిస్థితులు నెలకొనబోతున్నాయి. 48,500 ఏళ్ల క్రితంనాటి ప్రాణాంతక వైరస్‌ను శాస్త్రవేత్తలు సజీవంగా మలచారు.

కోరలు చాచిన మరో మహమ్మారి... 48,500 ఏళ్లనాటి వైరస్‌ను తట్టిలేపిన శాస్త్రవేత్తలు...

ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కరోనాకు మించిన ఘోర పరిస్థితులు నెలకొనబోతున్నాయి. 48,500 ఏళ్ల క్రితంనాటి ప్రాణాంతక వైరస్‌ను శాస్త్రవేత్తలు సజీవంగా మలచారు. రష్యాలోని గడ్డకట్టిన సరస్సు కింద ఉన్న 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు సజీవంగా వెలికితీశారు. ఈ జాంబీ వైరస్‌ యాక్టివేట్ అయితే మరో మహమ్మారి వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

యార్క్ పోస్ట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం, 'జాంబీ వైరస్'ని పునరుద్ధరించిన నేపధ్యంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు మరో మహమ్మారి భయాన్ని పెంచారు. న్యూయార్క్ పోస్ట్ ఈ వైరస్ గురించిన వివరాలను వెల్లడించింది. ఇది పురాతన కాలానికి చెందిన అంతుచిక్కని వైరస్. ఇది మొక్కలకు, జంతువులకు మానవులకు విపత్తుగా పరిణమించనుంది. ఇదిలావుండగా గ్లోబల్ వార్మింగ్ అనేది శాశ్వత మంచు ప్రాంతాలను కూడా కరిగిస్తోంది. ఈ గడ్డకట్టిన మంచుప్రాంతాల కింది భాగంలో సూక్ష్మజీవులు ఉండే అవకాశాలున్నాయి. అవి నిద్రాణమైన స్థితిలో ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. కాగా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్న జాంబో వైరస్ 48,500 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తోంది. ఇది ఘనీభవించిన వైరస్. 2013లో సైబీరియాలో శాస్త్రవేత్తలు గుర్తించిన 30 వేల ఏళ్ల నాటి వైరస్ రికార్డును ఇది బద్దలు కొట్టింది.

Updated Date - 2022-11-30T11:06:53+05:30 IST

Read more