Complaint To PM: పాపం.. భార్య నుంచి కాపాడాలని ఏకంగా ప్రధానికే ఫిర్యాదు చేశాడు..!

ABN , First Publish Date - 2022-11-02T18:48:33+05:30 IST

భర్త నుంచి శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకు సమాజం నుంచి, చట్టం నుంచి అనేక రకాల రక్షణ ఉంటుంది. అయితే భార్య చేతిలో బాధలు పడే భర్తలకు మాత్రం అలాంటివేవీ ఉండవు.

Complaint To PM: పాపం.. భార్య నుంచి కాపాడాలని ఏకంగా ప్రధానికే ఫిర్యాదు చేశాడు..!

వైవాహిక జీవితంలో గొడవలనేవి సర్వ సాధారణం. అయితే భర్త నుంచి శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకు సమాజం నుంచి, చట్టం నుంచి అనేక రకాల రక్షణ ఉంటుంది. అయితే భార్య చేతిలో బాధలు పడే భర్తలకు మాత్రం అలాంటివేవీ ఉండవు. పైగా అలాంటి భర్తను సమాజం చిన్న చూపు చూస్తుంటుంది. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అలాంటి ఆవేదనే వ్యక్తం చేశాడు. తన భార్య నుంచి తనను కాపాడాలని (Save me from my wife) ఏకంగా ప్రధాన మంత్రికి ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశాడు.

బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య అనే వ్యక్తి తన భార్యపై ట్విటర్ ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయానికి (Husband appeals to PM), న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, బెంగళూరు పోలీస్ కమిషనర్​‌కు ఫిర్యాదు చేశాడు. భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదా ఇది జరిగినపుడు నన్నెవరైనా రక్షించారా? మీరు గొప్పగా చెప్పుకునే నారీ శక్తి ఇదేనా? నేను ఆమెపై గృహహింస కేసు పెట్టవచ్చా? కుదరదు కదా అని అతను ట్వీట్ చేశాడు. అంతేకాదు భార్య చేసిన దాడి వల్ల చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై స్పందించిన బెంగళూరు కమిషనర్.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, కచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-02T18:50:27+05:30 IST
Read more