Viral News: కోడి కూతపై గరం గరం.. ఏకంగా పోలీసులను ఆశ్రయించిన దంపతులు!

ABN , First Publish Date - 2022-08-12T22:23:54+05:30 IST

ఇప్పుడంటే అలారం‌లు వచ్చాయి గానీ, పూర్వ కాలంలో కోడి కూతే (Rooster's crowing) అలారం.

Viral News: కోడి కూతపై గరం గరం.. ఏకంగా పోలీసులను ఆశ్రయించిన దంపతులు!

ఇప్పుడంటే అలారం‌లు వచ్చాయి గానీ, పూర్వ కాలంలో కోడి కూతే (Rooster's crowing) అలారం. గతంలో కోడి కూతనే తెల్లవారడానికి సంకేతంగా భావించేవారు. అయితే కొంత మంది కోడి కూతను డిస్ట్రబెన్స్‌గా భావిస్తుంటారు. జర్మనీకి (Germany) చెందిన ఓ జంట కోడి కూత వల్ల తాము డిస్ట్రబ్ అవుతున్నామని, అనారోగ్యానికి గురవుతున్నామని పేర్కొంటూ ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. తమ పక్కింట్లో ఉండే కోడిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. 


ఇది కూడా చదవండి..

Shocking: ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా? భార్యతో నీచ ప్రవర్తన.. తలపై మూత్రం పోసి.. దారణం


పశ్చిమ జర్మన్‌లోని బాడ్ సాల్జుఫ్లెన్‌లో ఫ్రెడరిక్, జుట్టా అనే దంపతులు నివసిస్తున్నారు. వారి పక్క ఇంటిలో ఒక కోడి ఉంది. అది పదే పదే అరుస్తుండడంతో ఫ్రెడరిక్, జుట్టా తరచుగా అసహనానికి గురయ్యేవారు. రాత్రి, పగలూ కూడా ఆ కోడి అరుస్తూనే ఉండేది. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పక్కింట్లో ఉండే కోడి రోజుకు దాదాపు 200ల సార్లూ కూస్తూనే ఉంటుందని, దాని వల్ల తమ ఆరోగ్యం పాడవుతోందని కంప్లైంట్ ఇచ్చారు. కోడి రాత్రంతా కూస్తునే ఉంటుందని పేర్కొన్నారు. 


`ఆ కోడి కూత వల్ల మా గార్డెన్‌లోకి వెళ్లలేకపోతున్నాం. కనీసం, కిటికీ తలుపులు కూడా తెరవలేకపోతున్నాం` అని ఫ్రెడరిక్ తెలిపారు. కాగా, ఆ కోడి యజమాని ఈ ఉదంతంపై స్పందించాడు. తమ ఇంట్లో ఉండే కోడి పెట్టల కోసం ఆ కోడి పుంజును పెంచుతున్నానని చెప్పాడు. కాగా, ఈ ఫిర్యాదుపై ఆ కోడి పుంజు యజమానికి జిల్లా కోర్టు నుంచి నోటీసులు అందాయి. అతను త్వరలోనే కోర్టులో హాజరుకావాల్సి ఉంది.  

Updated Date - 2022-08-12T22:23:54+05:30 IST