-
-
Home » Prathyekam » Revenue Officer put his feet on villager Collector Suspended The officer sgr spl-MRGS-Prathyekam
-
Madhya Pradesh: రెవెన్యూ అధికారి అహంకారం.. గ్రామస్థుడి భుజంపై కాలు వేసి జులుం.. చివరకు ఏమైందంటే..
ABN , First Publish Date - 2022-10-05T21:00:20+05:30 IST
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి తీరు విమర్శల పాలవుతోంది.

మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి తీరు విమర్శల పాలవుతోంది. గ్రామస్థుడితో అనుచితంగా ప్రవర్తించిన అధికారి కలెక్టర్ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యాడు. బినాలోని భాన్గర్ గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ జరిగింది. ఆ సభకు స్థానిక రెవెన్యూ అధికారి వినోద్ అహిర్వార్ హాజరయ్యాడు. అక్కడ గ్రామానికి చెందిన వ్యక్తికి, రెవెన్యూ అధికారికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. వినోద్ అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి..
ఈ పాప పుట్టిన 16 గంటల్లోనే షాకింగ్ ఘటన.. అధికారులే స్వయంగా ఈ బాలికకు ‘దుర్గ’ అని పేరు పెట్టడం వెనుక..
రెవెన్యూ అధికారితో గొడవపడిన వ్యక్తిని పోలీసులు స్టేషన్కు పిలిపించారు. తర్వాతి రోజు ఉదయం గ్రామస్థుడు రెవెన్యూ అధికారి కాళ్లు పట్టుకున్నట్టుగా, గ్రామస్థుడి భుజంపై రెవెన్యూ అధికారి కాలు వేసినట్టుగా ఉన్న ఫొటో బయటకు వచ్చి వైరల్ అయింది. ఈ ఫొటో తీవ్ర సంచలనం కలిగించింది. కలెక్టర్ కార్యాలయం వెంటనే స్పందించి ఆ రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేసింది. ఆ ఘటనపై సమగ్రంగా దర్యాఫ్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.