దహనానికి సిద్ధమవుతున్న 60 అడుగుల ‘లంకాపతి’, 50 అడుగుల మేఘనాథుడు, కుంభకర్ణుడు!

ABN , First Publish Date - 2022-09-29T17:34:06+05:30 IST

హర్యానాలోని కర్నాల్‌లో 119వ దసరా మహోత్సవాలు...

దహనానికి సిద్ధమవుతున్న 60 అడుగుల ‘లంకాపతి’, 50 అడుగుల మేఘనాథుడు, కుంభకర్ణుడు!

హర్యానాలోని కర్నాల్‌లో 119వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 5న అత్యంత వేడుకగా రామలీల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం 60 అడుగుల రావణాసురుడు, 50 అడుగుల మేఘనాథుడు, కుంభకర్ణుడు బొమ్మలను సిద్ధం చేశారు. ఉత్సవ కమిటీ సెక్రటరీ గోవింద్ పర్యవేక్షణలో ఈ  బొమ్మల తయారీ జరుగుతోంది. దసరాకు ఒక రోజు ముందుగానే ఈ బొమ్మల తయారీ పూర్తికానుంది.  


ఈసారి దసరా మైదానంలో రావణుని దహనం... ఆ బొమ్మ కళ్లకు నిప్పు అంటించడంతో ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కుటుంబం ఈ బొమ్మలను గత 20 ఏళ్లుగా తయారు చేస్తోంది. రావణుని బొమ్మ తయారు చేస్తున్న అర్షద్ మాట్లాడుతూ ఈసారి తయారు చేస్తున్న రావణుని బొమ్మ ముఖం నుంచి మంటలు వెలువడనున్నాయన్నారు. క్రోధంతో రావణుని నేత్రాలు మండిపోనున్నాయి. ఈ సమయంలో పెద్ద పెద్ద శబ్ధాలు వెలువడనున్నాయి. శ్రీరామునికి చెందిన ఒక ఎలక్ట్రానిక్ అగ్నిబాణం రావణుని అహంకారాన్ని అణచివేయనున్నదని తెలిపారు.  

Read more