ఈ యువతి ఓ డాక్టర్.. ప్రాణాలు నిలబెట్టాల్సింది పోయి.. తన ప్రాణాన్నే తీసుకుంది.. స్నేహితుడి భార్య వచ్చి తిట్టడంతో..

ABN , First Publish Date - 2022-09-27T21:13:14+05:30 IST

ఆ యువతి ఓ డాక్టర్.. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో పైకి ఎదుగుతోంది.. రోగులకు ధైర్యం చెప్పి వారి ప్రాణాలను కాపాడాల్సిన ఆ యువతి తన ప్రాణాన్నే తీసుకుంది..

ఈ యువతి ఓ డాక్టర్.. ప్రాణాలు నిలబెట్టాల్సింది పోయి.. తన ప్రాణాన్నే తీసుకుంది.. స్నేహితుడి భార్య వచ్చి తిట్టడంతో..

ఆ యువతి ఓ డాక్టర్.. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో పైకి ఎదుగుతోంది.. రోగులకు ధైర్యం చెప్పి వారి ప్రాణాలను కాపాడాల్సిన ఆ యువతి తన ప్రాణాన్నే తీసుకుంది.. మోతాదుకు మించి మత్తు మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.. సహచర వైద్యుడితో ప్రేమాయణం, అతడి భార్య చేసిన గొడవే ఆ వైద్యురాలి మృతికి కారణమని తెలుస్తోంది.. తన ప్రియుడి భార్య అందరి ముందూ తన పరువు తీయడంతో తట్టుకోలేక ఆ వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. రాజస్థాన్‌ (Rajasthan)లోని జోధ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: ఆ కుర్చీలను చూస్తే ఆఫీస్‌కు వెళ్లాలంటేనే భయమేస్తుంది.. శవపేటిక ఆకారంలో కుర్చీలను ఎందుకు తయారు చేశారంటే..జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రిలో పని చేస్తున్న సోనాలి (29), తన సహచర వైద్యుడు అంకిత్ (29)తో మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. అయితే అంకిత్‌కు అప్పటికే ఆకాంక్ష అనే మహిళతో వివాహం జరిగింది. అంకిత్ వివాహితుడనే సంగతి సోనాలికి కూడా తెలుసు. అయినా ఆమె అంకిత్‌ను వివాహం చేసుకోవాలనుకుంది. ఆ విషయం తెలుసుకున్న ఆకాంక్ష సోనాలి ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి గొడవ చేసింది. అక్కడ ఉన్న అందరి ముందు సోనాలీతో గొడవ పడింది. ఆమెను కొట్టింది. అంతేకాదు సోనాలీ ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులకు, సోదరికి కూడా విషయం చెప్పింది. 


కుటుంబ సభ్యులు సోనాలిని మందలించారు. అంకిత్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆకాంక్ష చేసిన పని సోనాలికి తీవ్ర మానసిక వేదన కలిగించింది. ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆదివారం రాత్రి సోనాలి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు ఎక్కించుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. `నా జీవితంలో ఏమీ మిగలలేదు, బతకాలనే ఆశ లేదు, క్షమించండి` అని సోనాలి రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Read more