బుల్లి తాబేలు, బుజ్జి కుక్కపిల్ల కలిసి ఏం చేస్తున్నాయో చూస్తే...

ABN , First Publish Date - 2022-10-12T15:11:49+05:30 IST

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...

బుల్లి తాబేలు, బుజ్జి కుక్కపిల్ల కలిసి ఏం చేస్తున్నాయో చూస్తే...

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి ఎంతో ఆసక్తిగొలుపుతాయి. ఆన్‌లైన్‌లో ఈ వీడియోలు వైరల్ కావడానికి ఇదే ప్రధాన కారణం. తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో ఒక బుల్లి తాబేలు, బుజ్జి కుక్కపిల్ల కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్నాయి. ట్విటర్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ జంతువులు ఆటలో పూర్తిగా నిమగ్నమైపోయాయి. అవి ఫుట్‌బాల్‌ను తన్నడాన్ని చూడవచ్చు. 


గాబ్రియెల్ కార్నో ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.8 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ "నా జీవితంలో నేను చూసిన అత్యంత వేగవంతమైన తాబేలు అది" అని రాశారు. మరొక యూజర్ "అద్భుతం.. ఈ జంతువులు ఇంతకు ముందు కలిసి ఆడటం ఎప్పుడూ చూడలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది" అని రాశారు. ఇంకొకరు “నా కళ్లను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను” అని రాశారు.

Updated Date - 2022-10-12T15:11:49+05:30 IST

Read more