-
-
Home » Prathyekam » Police Investigation Shifted From Robbery To Family Rivalry in meerut bank managers case sgr spl-MRGS-Prathyekam
-
Meerut: బ్యాంకు మేనేజర్ భార్య, కొడుకు హత్య కేసులో కొత్త ట్విస్ట్.. సన్నిహితుల పనేనని పోలీసుల అనుమానం..
ABN , First Publish Date - 2022-09-01T01:46:46+05:30 IST
మీరట్‌లో నివసిస్తున్న బ్యాంక్ మేనేజర్ భార్య, ఐదేళ్ల కుమారుడు సోమవారం అర్ధరాత్రి హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

మీరట్‌లో నివసిస్తున్న బ్యాంక్ మేనేజర్ భార్య, ఐదేళ్ల కుమారుడు సోమవారం అర్ధరాత్రి హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బ్యాంక్ మేనేజర్ ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో పరిస్థితిని చూసిన పోలీసులు చోరీకి వచ్చిన దొంగలు ఆ హత్యలు చేసి ఉంటారని మొదట భావించారు. అయితే విచారణ సాగుతున్న కొద్దీ ఆ హత్యలు దొంగలు చేసినవి కావని, బంధువులే పథకం ప్రకారం హత్యలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Thai YouTuber Cheating: అభిమానులను నిండా ముంచిన థాయ్‌లాండ్ యూట్యూబ్ స్టార్.. ఏకంగా రూ. 437 కోట్లకు కుచ్చుటోపీ
మీరట్ (Meerut)లో ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న సందీప్ భార్య శిఖా, ఐదేళ్ల బాలుడు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన శిఖా గర్భవతి. సందీప్ మీరట్‌లో లేని సమయంలో ఈ దాడి జరిగింది. తొలుత దొంగలు చేసి ఉంటారని అనుమానించారు. అయితే ఆ హత్యలు సన్నిహితుల పనేనని భావిస్తున్నారు. శిఖా మేనత్త కొడుకు హస్తం ఈ హత్యల వెనక ఉండి ఉండొచ్చని అనుమానించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి గతంలో దొంగతనం చేసి జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉంది.
అతడికి శిఖా కుటుంబంతో కొద్ది రోజుల క్రితం గొడవ జరిగినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడే ఈ జంట హత్యలు చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శిఖా బావ సహా నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు.