Viral Video: వామ్మో.. ఈ ఆటోలో ఎంత మంది ఎక్కారో చూస్తే షాకవడం ఖాయం..

ABN , First Publish Date - 2022-07-11T23:05:45+05:30 IST

సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించుకుని వెళుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వాహనాల్లో ఆటోలు మొదటి స్థానంలో ఉంటాయి.

Viral Video: వామ్మో.. ఈ ఆటోలో ఎంత మంది ఎక్కారో చూస్తే షాకవడం ఖాయం..

సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించుకుని వెళుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వాహనాల్లో ఆటోలు మొదటి స్థానంలో ఉంటాయి. ఏడుగురు ఎక్కాల్సిన ఆటోలో ఏకంగా పది, పన్నెండు మందిని డ్రైవర్లు ఎక్కిస్తుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏకంగా 27 మందిని ఎక్కించుకుని తన ఆటోను మినీ బస్‌లా మార్చేశాడు ఓ వ్యక్తి.  ఆ వీడియో చూసిన అందరూ షాకవుతున్నారు. ఒక ఆటోలో అంత మంది ఎలా పట్టారా అని ఆశ్చర్యపోతున్నారు. 


ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు ఆటోలో  బయలుదేరారు. బింద్కీ ప్రాంతంలో పోలీసులను చూసి ఆటో డ్రైవర్ వేగంగా నడిపాడు. దీంతో పోలీసులు ఆ ఆటోని ఫాలో అయ్యారు. కొంతదూరం వెంబడించి ఆటోను ఆపి.. లోపల కూర్చున్న జనాన్ని చూసి షాక్ అయ్యారు. పోలీసులు ఒక్కొక్కరిని లెక్కబెట్టి మొత్తం 27మంది ప్రయాణిస్తున్నట్టు తేల్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా మెహ్రాహ గ్రామానికి చెందిన వీరందరూ ఒకే ఆటోలో నమాజ్‌ చేయడానికి బయలుదేరారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Read more