ABN Andhrajyothy Debate: పోలవరాన్ని జగన్ ప్రభుత్వం పుట్టి ముంచేసిందా?

ABN , First Publish Date - 2022-07-26T01:34:04+05:30 IST

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)పై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సంచలన విషయాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో..

ABN Andhrajyothy Debate: పోలవరాన్ని జగన్ ప్రభుత్వం పుట్టి ముంచేసిందా?

అమరావతి/హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)పై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సంచలన విషయాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని ఆయన తేల్చి చెప్పారు. దశలవారీగా మాత్రమే పోలవరం పూర్తి చేయడం కుదురుతుందని తెలిపారు.  సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టును ఇదిగో కడుతున్నామని.. అదిగో అయిపోతుందని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అంబటి చెప్పిన నిజంతో తన వైఖరేంటో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. 


ఇక ఇదే విషయాన్ని ఇటీవల కాలంలో కేంద్రప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల (Tdp Mp KankaMedala) పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు (Bishweswar Tudu) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందని వెల్లడించారు. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనలు 73 శాతం, పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి తెలిపారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమేనని, అయితే 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్‌సీసీ నివేదిక ఇచ్చిందని, దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపిందని బిశ్వేశ్వర తుడు తన లిఖితపూర్వక సమాధానలో పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో ‘‘జగన్ రెడ్డి ప్రభుత్వం పోలవరాన్ని పుట్టి ముంచేసిందా?. మాటలు తప్ప చేతలు లేకుండా నాశనం చేసిందా?. డిజైన్లకు విరుద్ధంగా నిర్మాణ పనులే కొంప ముంచాయా?. పర్యవేక్షక కమిటీని కాంట్రాక్ట్ సంస్థ లెక్క చేయడం లేదా?. భూసేకరణ పునరావాసాన్ని జగన్ రెడ్డి గాలికొదిలేశారా?. నిధులు విడుదల చేయకుండా ఏపీ జీవనాడిని చంపేస్తున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..



Updated Date - 2022-07-26T01:34:04+05:30 IST