ప్లాస్టిక్‌ పిరమిడ్‌

ABN , First Publish Date - 2022-10-02T21:45:59+05:30 IST

చెత్తతో కూడా సెల్ఫీలు దిగుతారా? అదీ మిస్‌ ఈజిప్టు టైటిల్‌ అందుకున్న ఈ సౌందర్యరాశి సెల్ఫీ దిగుతోందే...

ప్లాస్టిక్‌ పిరమిడ్‌

చెత్తతో కూడా సెల్ఫీలు దిగుతారా? అదీ మిస్‌ ఈజిప్టు టైటిల్‌ అందుకున్న ఈ సౌందర్యరాశి సెల్ఫీ దిగుతోందే. ఈ ఫొటో వెనక పెద్ద కథే ఉంది. ఈమె పేరు హేగర్‌ మహమద్‌. ‘2022 మిస్‌ ఈజిప్టు’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆమె వెనక ఉంది ప్లాస్టిక్‌ చెత్త పిరమిడ్‌. ఇదంతా కూడా ఈజిప్టు జీవనరేఖగా పేరు తెచ్చుకున్న నైలు నదిలో దొరికిన చెత్త. ‘ద వెరీనైల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నైలు నదిలో మాత్రమే సేకరించిన చెత్తతో అతి పెద్ద పిరమిడ్‌ను నిర్మిస్తోంది. అంతే కాకుండా నదీ ప్రక్షాళనకు నడుం బిగించింది.   ఈ స్వచ్ఛంద సంస్థ 2018 లో ఏర్పడింది. ఈజిప్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ఎన్‌జీఓకు మద్దతు ఇస్తోంది. దీని కోసం అనేక మంది వాలంటీర్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్థాయిలో సముద్రాలను కలుషితం చేస్తోన్న పది నదుల్లో నైలు నది ఒకటని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ప్రకటించింది. నదీ కాలుష్యం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం గురించి అవగాహన కలిగించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది.


Updated Date - 2022-10-02T21:45:59+05:30 IST