Pilot sweet surprise: తాము ఎక్కిన విమానం పైలట్ తన కుమారుడని తెలిసి తల్లిదండ్రుల ఆశ్చర్యం...Viral video

ABN , First Publish Date - 2022-07-22T18:00:19+05:30 IST

ఓ విమాన పైలట్ తన తల్లిదండ్రులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

Pilot sweet surprise: తాము ఎక్కిన విమానం పైలట్ తన కుమారుడని తెలిసి తల్లిదండ్రుల ఆశ్చర్యం...Viral video

జైపూర్(రాజస్థాన్):ఓ విమాన పైలట్ తన తల్లిదండ్రులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ నుంచి జైపూర్ నగరానికి వెళ్లే విమానం నడిపేందుకు కమల్ కుమార్ అనే పైలెట్ డ్యూటీలో భాగంగా విమానం ఎక్కారు. పైలట్ తన తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లోని వారి ఇంటికి వెళ్లేందుకు విమానం ఎక్కారు. తల్లిదండ్రులు తాము ప్రయాణించే విమానం ఎక్కారు కానీ, ఆ విమానం నడపబోతున్నది పైలట్ అయిన తమ కొడుకు అని వారికి తెలియదు. తన తల్లిదండ్రులు ప్రయాణించే విమానం అని తెలియకుండానే విధి నిర్వహణలో భాగంగా పైలట్ కమలకుమార్ ఫ్లైట్ ఎక్కి కాక్ పిట్ ప్రవేశద్వారం వద్ద ఉన్నారు. పైలట్ కమలకుమార్ తల్లిదండ్రులు విమానం ఎక్కాక అకస్మాత్తుగా తమ కుమారుడైన పైలట్ ను కాక్‌పిట్ ప్రవేశద్వారం వద్ద చూశారు. తల్లి కాసేపు ఆగి కొడుకు చేయి పట్టుకుని నవ్వింది.


అనంతరం పైలట్ తన విమానం ఎక్కిన తల్లిదండ్రులతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ వీడియోలో కమల్ కాక్‌పిట్‌లో తల్లిదండ్రులతో కలిసి కూర్చున్న చిత్రాలు కూడా ఉన్నాయి.‘‘నేను పైలట్ గా విమానం నడపడం ప్రారంభించినప్పటి నుంచి నేను నడిపే విమానంలో నా తల్లిదండ్రులు ప్రయాణించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను... చివరకు జైపూర్‌కి తల్లిదండ్రులు ఎక్కిన విమానం నడిపే అవకాశం నాకు లభించింది. ఇది నాకు ఆనంద అనుభూతి మిగిల్చింది’’ అని పైలట్ కమలకుమార్ వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు.ఈ మధురమైన వీడియో నెటిజన్ల ముఖాల్లో చిరునవ్వు మిగిల్చింది.


ప్రతి బిడ్డ కోరుకునే విషయం ఏమిటంటే, వారి తల్లిదండ్రులను సంతోషపెట్టడం. తన తల్లిదండ్రులను ఆశ్చర్య పర్చిన కమల్ కుమార్ అనే పైలట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను రెండు మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.ఈ వీడియోకు నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను మీరూ ఒకసారి వీక్షించండి....




Updated Date - 2022-07-22T18:00:19+05:30 IST