-
-
Home » Prathyekam » Photos and videos of a woman stealing from a gold shop are going viral on social media kjr spl-MRGS-Prathyekam
-
Woman theft: ముందు అమాయకురాలని అనుకున్నాడు.. కాసేపటికి తేరుకుని అవాక్కయిన బంగారు వ్యాపారి..
ABN , First Publish Date - 2022-10-02T02:15:13+05:30 IST
కొందరు అసలు రంగు బయటపడేవరకూ.. చూడటానికి పైకి అమాయకుల్లా కనిపిస్తారు. ఏమాత్రం నమ్మినా చివరకు నట్టేట ముంచేస్తారు. ఇంకొందరు చూసేందుకు హుందాగా ఉంటారు.. కానీ..

కొందరు అసలు రంగు బయటపడేవరకూ.. చూడటానికి పైకి అమాయకుల్లా కనిపిస్తారు. ఏమాత్రం నమ్మినా చివరకు నట్టేట ముంచేస్తారు. ఇంకొందరు చూసేందుకు హుందాగా ఉంటారు.. కానీ అసలు విషయం తెలిశాక.. వామ్మో! అని అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇటీవల చాలా మంది మహిళలు కూడా నేరాలు చేయడం పెరిగిపోయింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తమ పని తాము కానిచ్చేస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి.. ఇలాంటి నేరాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఓ మహిళ చేసిన దొంగతనం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అమాయకురాలిలా ఉండడంతో బంగారు దుకాణ యజమానికి అసలు అనుమానం రాలేదు. అయితే చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని షాక్ అయ్యాడు.
సోషల్ మీడియాలో (Social media) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ బంగారు నగల దుకాణంలోకి (gold shop) మహిళతో పాటూ ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. పైకి హుందాగా ఉండడంతో దుకాణ యజమాని వారిని కూర్చోబెట్టి నగలను చూపెడతాడు. ముసుగు ధరించిన మహిళ మధ్యలో కూర్చుని ఉండగా.. ఆమెకు రెండు వైపులా మిగతా ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. ముక్కు పుడకలు, ఉంగరాలు తదితర బంగారు వస్తువులను చూపించమని అడుగుతారు. దీంతో వారు చెప్పిన వస్తువులను ఒక్కొక్కటి తీసి చూపిస్తుంటాడు. అయితే వారిలో ఓ వ్యక్తి ముందుగు వంగి.. దుకాణ యజమానిని తికమక పెడతాడు.
పెళ్లి మంటపంలో వరుడి ముందే.. స్నేహితులతో కలిసి గదిలోకి వెళ్లిన యువతి.. కాసేపటికి అంతా షాకయ్యేలా...

తర్వాత మొత్తం నగలను చూపించమని అడగ్గా.. చిన్న చిన్న వస్తువులను ముందు వైపు కుప్పగా పోస్తాడు. ఓ వ్యక్తి యజమాన్ని మాటల్లో దింపగా.. మధ్యలో ఉన్న ముసుగు మహిళ.. చాకచక్యంగా కొన్ని బంగారు వస్తువులను మాయం చేస్తుంది. తర్వాత ఏవీ నచ్చలేదంటూ అక్కడి నుంచి అంతా మెల్లగా జారుకుంటారు. వారు వెళ్లిన చాలా సేపటికి బంగారు వస్తువులను చూడగా.. అనుమానం వస్తుంది. చివరకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించడంతో అసలు విషయం బయటపడుతుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ చోరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.