రోడ్డుపై నడుస్తూ హఠాత్తుగా మాయమవుతున్న జనం... వారంతా ఏమైపోతున్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-09-29T15:27:08+05:30 IST

మ్యాజిక్ షోలను మనం ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం.

రోడ్డుపై నడుస్తూ హఠాత్తుగా మాయమవుతున్న జనం... వారంతా ఏమైపోతున్నారో తెలిస్తే...

మ్యాజిక్ షోలను మనం ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. వీటిలో మనుషులను మాయం చేసే ట్రిక్ అందరికీ ఆశ్చర్యం గొలుపుతుంది. మెజీషియన్ తన మంత్రశక్తితో ఇలా చేస్తాడని అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే దీని వెనుక ఎటువంటి మాయలు మంత్రాలు లేవని, ఇదంతా కనికట్టు విద్య అని తెలివైనవారు భావిస్తుంటారు. ఇదిలావుంటే తాజాగా ఇటువంటి ఒక వీడియో వైరల్‌గా మారింది. 
సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ వీడియోలో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు ఉన్నట్టుండి మాయమవడం కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక కళాకారుడు తన పెయింటింగ్ కేన్వాస్‌పై వేస్తున్న రంగుకు... రియల్ వరల్డ్ పెయింటింగ్‌కు ఎటువంటి తేడా కనిపించడం లేదు. ఈ వీడియోను చూసినవారంతా ఎంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ వీడియోకు 16 మిలియన్లకు మించిన వ్యూస్ దక్కాయి. 49 సెకెన్లున్న ఈ వీడియోలో కళాకారుని ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది.

Read more