Uttarakhand: కొద్ది గంటల పాటు జైలు జీవితం గడపాలనుకునే వారికి బంపరాఫర్.. ఉత్తరాఖండ్ అధికారుల వినూత్న ఆలోచన

ABN , First Publish Date - 2022-09-29T02:47:55+05:30 IST

జైలు జీవితం అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. జైలులోకి వెళ్లాలని ఎవరూ అనుకోరు. కానీ, జైలు జీవితం (jail experience) ఎలా ఉంటుంది?

Uttarakhand: కొద్ది గంటల పాటు జైలు జీవితం గడపాలనుకునే వారికి బంపరాఫర్.. ఉత్తరాఖండ్ అధికారుల వినూత్న ఆలోచన

జైలు జీవితం అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. జైలులోకి వెళ్లాలని ఎవరూ అనుకోరు. కానీ, జైలు జీవితం (jail experience) ఎలా ఉంటుంది? అక్కడి ఖైదీలతో అధికారులు ఎలా ప్రవర్తిస్తారు? అనే కుతూహలం మాత్రం కొందరికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్ జైలు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. జైలులో కొన్ని గంటల పాటు ఉండటానికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆసక్తికర కారణం ఉంది. 


ఇది కూడా చదవండి..

Bihar: `కండోమ్‌లు కూడా ఉచితంగానే కావాలంటారు`.. బాలికతో అనుచితంగా మాట్లాడిన IAS అధికారిణి..


సాధారణంగా తమ దగ్గర జాతకం చూపించుకోవడానికి వచ్చే వ్యక్తులకు జ్యోతీష్యులు కొన్ని ఉపచారాలు చెబుతుంటారు. జాతకంలో ఏమైనా దోషం ఉంటే నివారణ కోసం కొన్ని ఉపాయాలు చెబుతుంటారు. అలాంటి వాటిలో ఒక రాత్రి జైలు జీవితం కూడా ఉంటుంది. జ్యోతీష్యాన్ని నమ్మే కొంతమంది వ్యక్తులు దోష నివారణ కోసం ఒక రాత్రి జైలు జీవితం గడపాలనుకుంటారు. అలాంటి వారు, జైలు అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేవారు రూ.500 చెల్లించి జైలు జీవితాన్ని రుచి చూడవచ్చని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. అలాంటి వారి కోసం జైలులో ప్రత్యేకంగా గదులను కూడా కేటాయిస్తారు. అంతేకాదు ఖైదీలు ధరించే దుస్తులను కూడా ఇస్తారు. 


తొలిసారిగా ఈ అవకాశాన్ని హల్ద్వానీ జైలులో ప్రారంభిస్తున్నారు. 1903లో నిర్మించిన హల్ద్వానీ జైలులో ఆరు సిబ్బంది క్వార్టర్‌లతో కూడిన పాత ఆయుధశాల ఉంది. జైలు బ్యారక్‌లో కొన్ని గంటలు గడపడానికి అనుమతించాలని కోరుతూ జైలుకు తరచుగా సీనియర్ అధికారుల నుంచి ఆదేశాలు అందుతున్నాయి. ఈ పర్యాటక ఖైదీలకు జైలు వంటగదిలో తయారు చేసిన ఆహారం అందిస్తామని సీనియర్ పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-09-29T02:47:55+05:30 IST