రైల్లో రాత్రంతా అలాగే పడుకున్నాడో ప్రయాణీకుడు.. చనిపోయాడేమోనని పక్క బెర్త్‌పై ఉన్న వ్యక్తికి డౌట్.. ఫొటో తీసి ట్వీట్ చేస్తే..

ABN , First Publish Date - 2022-08-23T22:51:44+05:30 IST

ఆ వ్యక్తి ముంబై (Mumbai) నుంచి తన గ్రామానికి వెళ్లేందుకు సోమవారం లోకమాన్య తిలక్ టెర్మినల్‌లో

రైల్లో రాత్రంతా అలాగే పడుకున్నాడో ప్రయాణీకుడు.. చనిపోయాడేమోనని పక్క బెర్త్‌పై ఉన్న వ్యక్తికి డౌట్.. ఫొటో తీసి ట్వీట్ చేస్తే..

ఆ వ్యక్తి ముంబై (Mumbai) నుంచి తన గ్రామానికి వెళ్లేందుకు సోమవారం లోకమాన్య తిలక్ టెర్మినల్‌లో గోదాన్ ఎక్స్‌ప్రెస్ (Godan Express) ఎక్కాడు.. తన బెర్త్ ఎక్కి నిద్రపోయాడు.. ఆ రాత్రంతా నిద్ర లేవలేదు.. దీంతో ఎదురు బెర్త్‌లో ఉన్న వ్యక్తికి అనుమానం వచ్చింది.. ఎంతకీ అతడిలో కదలిక కనిపించకపోవడంతో రైల్వే అధికారులకు పరిస్థితి వివరిస్తూ ఓ ట్వీట్ చేశాడు.. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌‌లో (Prayagraj Junction) రైలు ఎక్కి అతడిని పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు. 


ఇది కూడా చదవండి..

Viral News: బీచ్‌లో తల లేకుండా అర్ధ నగ్న స్థితిలో యువతి మృతదేహం.. తీరా అసలు విషయం తెలుసుకుని అంతా షాక్!


ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని సిరతు గ్రామానికి చెందిన సోనూ కుమార్ ముంబైలో నివసిస్తున్నాడు. సోనూ సోమవారం సాయంత్రం ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌లో గోదాన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ప్రయాగ్‌రాజ్‌లో దిగాలనుకున్నాడు. రైలు ఎక్కి బెర్త్ నంబర్ 28లో పడుకున్నాడు. రాత్రంతా నిద్ర లేవలేదు. ఉదయం కూడా అతడు అలా పడుకునే ఉన్నాడు. సోనూ పరిస్థితి చూసి ఎదురు బెర్త్‌లో కూర్చున్న అబ్దుల్ అజీమ్ అనే ప్రయాణికుడికి అనుమానం వచ్చింది. వెంటనే సోనూ ఫోటో తీసి DRM ప్రయాగ్‌రాజ్, RPF, GRPలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ చూసిన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించారు. 


రైలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కు చేరుకోగానే, రైల్వే వైద్యులు, GRP సిబ్బంది రైలు వద్దకు చేరుకున్నారు. సోనూను పరీక్షించిన డాక్టర్ అతను గుండెపోటుతో (Passenger dies due to heart attack) చనిపోయినట్టు నిర్ధారించాడు. దీంతో జీఆర్పీ సిబ్బంది సోనూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వారికి అప్పగించారు. కాగా, సోనూ పరిస్థితిని సకాలంలో గుర్తించి వైద్యం అందించి ఉంటే, అతను బతికేవాడని డాక్టర్ చెప్పారు.  

Read more