Viral News: అతడి వయసు 62ఏళ్లు.. తాజాగా ఐదో పెళ్లి.. కేవలం ఆ ఒక్క కారణం వల్లే అట!

ABN , First Publish Date - 2022-10-03T01:30:57+05:30 IST

అతడి వయసు 62ఏళ్లు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 10 మంది కూతుళ్లు, ఒక కుమారుడితో కలిపి మొత్తం 11 మందికి జన్మనిచ్చాడు. ఇందులో 8 మంది కూతుళ్ల పెళ్లిళ్లు చేసేశాడు. ఒక్కగానొక్క కుమారిడికి కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. ప్రస్తుతం అతడికి 40 మంది మనవళ్లు, మనవ

Viral News: అతడి వయసు 62ఏళ్లు.. తాజాగా ఐదో పెళ్లి.. కేవలం ఆ ఒక్క కారణం వల్లే అట!

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు 62ఏళ్లు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 10 మంది కూతుళ్లు, ఒక కుమారుడితో కలిపి మొత్తం 11 మందికి జన్మనిచ్చాడు. ఇందులో 8 మంది కూతుళ్ల పెళ్లిళ్లు చేసేశాడు. ఒక్కగానొక్క కుమారిడికి కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. ప్రస్తుతం అతడికి 40 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇతడు చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మిగిలిన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి జరిగే సమయంలోనే మరో మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. అయితే.. తాను ఐదో పెళ్లి చేసుకోవడానికి పెద్ద కారణమే అందని అతడంటున్నాడు. కాగా.. ఇంతకూ కూతుళ్లతోపాటు ఐదో పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వయసులో అతడు ఐదో పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇప్పటి వరకు చెప్పుకున్న ముచ్చటంతా పాకిస్థాన్‌కు చెందిన షౌకత్‌దే. ఆరు పదుల వయసులో ఈయన ఐదో పెళ్లి చేసుకున్నాడు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా 62 మంది కుటుంబ సభ్యల సమక్షంలో.. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఐదో పెళ్లి చేసుకున్నాడు. ఓ యూట్యూబర్ షౌకత్‌ను ఇంటర్యూ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్యూ సందర్భంగా మాట్లాడిన షౌకత్.. తాను ఐదో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని వివరించాడు. ఇప్పటి వరకు నాలుగు పెళ్లి చేసుకుని 11 మందికి జన్మనిచ్చినట్టు చెప్పాడు. 11 మంది సంతానంలో ఎనిమిది మంది కూతుళ్లు, ఒక కుమారుడు సహా మొత్తం 9 మంది పిల్లల పెళ్లిళ్లు చేశాడట. తర్వాత మిగిలిన ఇద్దరు కూతుళ్లకు కూడా పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడట.


అప్పుడే తన ఆ ఇద్దరు కూతుళ్లు.. తనను కూడా ఐదో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారట. ‘వృద్ధాప్యంలో ఒంటరిగా ఎలా ఉంటావ్’ అని పట్టుబట్టి మరీ తనను ఐదో పెళ్లి చేసుకోవాల్సిందిగా వాదించారట. దీంతో కూతుళ్ల మాటలను కాదనలేక.. అతడు ఐదో పెళ్లికి ఒప్పుకున్నాడట. ఇచ్చిన మాట ప్రకారమే.. కూతుళ్ల పెళ్లి జరుగుతుండగానే.. షౌకత్‌ కూడా ఐదో పెళ్లి చేసుకున్నాడట. ఈ సందర్భంగా షౌకత్ ఐదో భార్య మాట్లాడుతూ.. ఈ పెళ్లిపట్ల సంతోషం వ్యక్తం చేసింది. పెద్ద కుటుంబలో సభ్యురాలైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే.. 62 మంది కుటుంబ సభ్యుల కోసం ఇంట్లో పూటకు 100 రోటీల వరకు సిద్ధం చేస్తారని షౌకత్ అన్నాడు. అయితే.. షౌకత్ నలుగురు భార్యలకు సంబంధించిన వివరాలపై స్పష్టత లేదు.


Read more