-
-
Home » Prathyekam » On the pretext of help fatherinlaw placed a shocking demand sgr spl-MRGS-Prathyekam
-
భర్త చనిపోయి దు:ఖంలో ఉన్న కోడలికి మామగారి ఆఫర్.. మనవడి చదువుకు సహాయం చేస్తానని చెప్పి ఏం అడిగాడంటే..!
ABN , First Publish Date - 2022-03-16T21:21:15+05:30 IST
ఆమె భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉంది.. పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంది..

ఆమె భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉంది.. పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంది.. మనవళ్ల చదువుకు ఆర్థిక సహాయం చేయమని మామగారిని అడిగింది.. అయితే ఆ మామగారు రిటర్న్ గిఫ్ట్ అడిగాడు.. తనతో శారీరక సంబంధం పెట్టుకుంటేనే డబ్బులు ఇస్తానని చెప్పాడు.. షాకైన మహిళ ఆ విషయం గురించి తన బావగారికి చెప్పింది.. అతను పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాధిత మహిళ భర్త రెండేళ్ల కిందట మరణించాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయిన తర్వాత ఆమె తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. పిల్లలను పాఠశాలలో జాయిన్ చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలని మామగారిని అడిగింది. అతడు అందుకు అంగీకరించాడు. అయితే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బాధిత మహిళను అడిగాడు. అసభ్యంగా మాట్లాడాడు.
షాకైన మహిళ తన భర్త సోదరుడికి విషయం చెప్పింది. అయితే అతను పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ అజ్మీర్‌లోని పోలీస్ స్టేషన్లో తన మామగారిపై ఫిర్యాదు చేసింది. ఫోన్లో తన మామగారు మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి పోలీసులకు వినిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.