Viral Video: ఈ ముసలాయన డ్యాన్స్ చూస్తే `వావ్` అనకుండా ఉండలేరు.. యువతితో కలిసి అతను ఎలా చిందులేశాడంటే..

ABN , First Publish Date - 2022-10-07T01:46:20+05:30 IST

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నంత కాలం వయసు అడ్డు రాదు.

Viral Video: ఈ ముసలాయన డ్యాన్స్ చూస్తే `వావ్` అనకుండా ఉండలేరు.. యువతితో కలిసి అతను ఎలా చిందులేశాడంటే..

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నంత కాలం వయసు అడ్డు రాదు. అందుకే కొంత మంది వృద్ధాప్యాన్ని కూడా చక్కగా ఆస్వాదిస్తారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ముసలాయన డ్యాన్స్ చూస్తే అది నిజమనిపించకమానదు. ఆ వీడియోలో ఓ పెద్దాయన ఓ అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపర్చాడు. యువతితో పోటీపడుతూ ఆ ముసలాయన చేసిన సాల్సా డ్యాన్స్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. 


ఆ వీడియో ప్రకారం.. ఒక పార్టీలో ఓ వృద్ధుడు యువతితో కలిసి సాల్సా డ్యాన్స్ చేశాడు. యువతితో సమానంగా స్టెప్పులేశాడు. వయస్సు మర్చిపోయి తాను ఓ కుర్రాడినే అన్నట్లు యువతితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఇప్పటికి 11 లక్షలకు పైగా లైకులు సాధించింది. ఆ వీడియోలో వృద్ధుడి డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-10-07T01:46:20+05:30 IST