ఇంటిలో ‘యాంటీ న్యూక్లియర్ బంకర్’... 25 ఏళ్లకు సరిపడా నిత్యావసరాలు... అమెరికన్ మహిళ ముందు జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-09-27T16:53:28+05:30 IST

ఒక మహిళ రూ. 13 లక్షలు ఖర్చుచేసి ‘యాంటీ న్యూక్లియర్ బంకర్’ను సిద్ధం చేసుకుంది.

ఇంటిలో ‘యాంటీ న్యూక్లియర్ బంకర్’... 25 ఏళ్లకు సరిపడా నిత్యావసరాలు... అమెరికన్ మహిళ ముందు జాగ్రత్త!

ఒక మహిళ రూ. 13 లక్షలు ఖర్చుచేసి ‘యాంటీ న్యూక్లియర్ బంకర్’ను సిద్ధం చేసుకుంది. ఈ బంకర్‌లో రోజువారీ ఉపయోగించే సామగ్రి అంతా అందుబాటులో ఉంది. అమెరికాకు చెందిన రోవన్ మెకెంజీ ఈ బంకర్‌ను సిద్ధం చేసుకుంది. ఈ బంకర్ నిర్మాణానికి రెండేళ్లు పట్టిందని ఆమె తెలిపింది. నిత్యావసరాలన్నీ బంకర్‌లో అందుబాటులో ఉంచుకున్నానని ఆమె తెలిపింది. ఇంటి బేస్‌మెంట్‌లో రూ 13 లక్షల వ్యయంతో బంకర్ నిర్మాణం జరిగింది. 


దీనిలో తాను 25 ఏళ్లకు సరిపడా నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకున్నానని ఆమె తెలిపింది. అలాగే లైసెన్సు కలిగిన కొన్ని ఆయుధాలను కూడా సమకూర్చుకున్నానని పేర్కొంది. న్యూక్లియర్ దాడులు జరిగిన పక్షంలో కూడా తనకు బంకర్‌లో రక్షణ లభిస్తుందని ఆమె తెలిపింది. ఈ బంకర్‌కు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు ఇది డబ్బులు వృథా చేసే పనేనని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సమాధానమిచ్చిన రోవన్ ఈ నిర్మాణం తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. 


Read more