సరిగ్గా 20 రోజుల క్రితం పెళ్లి.. కానీ ఇంతలోనే ఘోరం.. ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా..

ABN , First Publish Date - 2022-04-05T21:04:04+05:30 IST

పై ఫొటోలోని ఎంతో సంతోషంగా ఉన్న వధూవరులను చూశారా? వీరికి సరిగ్గా 20 రోజుల క్రితం వివాహం జరిగింది.

సరిగ్గా 20 రోజుల క్రితం పెళ్లి.. కానీ ఇంతలోనే ఘోరం.. ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా..

పై ఫొటోలోని ఎంతో సంతోషంగా ఉన్న వధూవరులను చూశారా? వీరికి సరిగ్గా 20 రోజుల క్రితం వివాహం జరిగింది. దాంపత్యపు తొలి రోజులను ఇద్దరూ ఆస్వాదిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ ఘోరం జరిగిపోయింది. సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరూ చెరువులో పడిపోయారు. యువతిని స్థానికులు రక్షించగా.. యువకుడు మాత్రం చెరువులో మునిగిపోయి చనిపోయాడు. 


కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన రేజిలాల్ అనే వ్యక్తికి గత నెల 14న వివాహం జరిగింది. సోమవారం ఉదయం వీరిద్దరూ కుట్టియాడి అనే టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఓ చెరువు ముందు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అనుకోకుండా ఇద్దరూ లోతైన ఆ చెరువులో పడిపోయారు. వారిద్దరూ పడిపోవడాన్ని చూసిన స్థానికులు అతి కష్టం మీద యువతిని రక్షించగలిగారు. రేజిలాల్‌ను మాత్రం కాపాడలేకపోయారు. 


ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో సోమవారం సాయంత్రానికి రేజిలాల్ మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేజిలాల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రేజిలాల్ భార్య ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.   

Read more