చాణక్య నీతి: ఈ ప్రదేశాలలో ఉంటే ఎంతటివారికైనా తిప్పలు తప్పవు!

ABN , First Publish Date - 2022-07-18T12:47:28+05:30 IST

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో...

చాణక్య నీతి: ఈ ప్రదేశాలలో ఉంటే ఎంతటివారికైనా తిప్పలు తప్పవు!

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. వీటిని అవగాహన చేసుకోవడం ద్వారా విజయవంతమైన జీవితాన్ని అందుకోవచ్చు. మనిషి కొన్ని ప్రదేశాలలో ఉండడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఆ తరువాత పశ్చాత్తాపపడతాడని ఆచార్య చాణక్య తెలిపారు. 

గౌరవం లభించని చోట.. 

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా సరే వారికి గౌరవం లభించని ప్రదేశాలలో ఎప్పుడూ ఉండకూడదు. అలాంటి ప్రదేశాల్లో నివసించడం వల్ల వారికి ఉపయోగం ఉండదు. గౌరవానికి భంగం కలిగించే వ్యక్తుల మధ్య జీవిస్తే చివరికి అశాంతి మిగులుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. 


విద్యలేని చోట..

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం చదువుకు ప్రాధాన్యత ఇవ్వని ప్రదేశంలో ఉండటం ప్రయోజనకరం కాదు. అలాంటి చోట ఉండటం వల్ల పిల్లల జీవితం, భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతాయి.

స్నేహితులు, బంధువులు లేని చోట.. 

ఎవరైనా సరే తమకు స్నేహితులు, బంధువులు లేని ప్రదేశంలో నివసించకూడదు. అటువంటి స్థలాన్ని వెంటనే విడిచిపెట్టాలి. అలాంటిచోట ఉంటే  మీకు అవసరమైనప్పుడు ఎవరి సాయం కూడా అందదు. 

ఉపాధిలేని చోట.. 

ఎవరైనా సరే ఉపాధి లేని ప్రదేశాలలో నివసించకూడదు. అలాంటి ప్రదేశాల్లో నివసించడం వల్ల ఉపయోగం లేదు. డబ్బు లేనప్పుడు జీవితం సాగడం చాలా కష్టం. ఎవరైనా సరే జీవనోపాధి లేని ప్రదేశాలలో నివసించకూడదు.

Updated Date - 2022-07-18T12:47:28+05:30 IST