Viral Video: మెట్రో రైల్లో టవల్‌తోనే ఓ కుర్రాడి హల్ చల్.. ఫన్నీ కామెంట్స్‌తో వైరల్ చేస్తున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2022-12-08T19:17:21+05:30 IST

ఎలాగైనా నెట్టింట గుర్తింపు రావాలనే ఉద్దేశంతో కొందరు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. తదితర వేదికల ద్వారా వివిధ రకాల వీడియోలను షేర్ చేస్తుంటారు. వీటిలో

Viral Video: మెట్రో రైల్లో టవల్‌తోనే ఓ కుర్రాడి హల్ చల్.. ఫన్నీ కామెంట్స్‌తో వైరల్ చేస్తున్న నెటిజన్లు..!

ఎలాగైనా నెట్టింట గుర్తింపు రావాలనే ఉద్దేశంతో కొందరు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (Youtube).. తదితర వేదికల ద్వారా వివిధ రకాల వీడియోలను పోస్టు చేస్తుంటారు. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్యర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులు, రైళ్లు, విమానాల్లో కొందరు విచిత్ర పనులు చేస్తూ వీడియోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఓ వ్యక్తి మెట్రో రైల్లో (Metro train) టవల్‌ కట్టుకుని ప్రయాణించి హల్ చల్ చేశాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో వీడియో వైరల్ చేస్తున్నారు.

Viral Video: నడిరోడ్డుపై ఏంటీ పనులంటూ ఈ యువతిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలు కథేంటంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. రద్దీగా ఉన్న మెట్రో రైలులోకి ఓ వ్యక్తి బనియన్ వేసుకుని, టవల్ కట్టుకుని ప్రవేశించాడు. బోగీలో అటూ ఇటూ తిరుగుతూ అద్దంలో చూసుకుంటూ ఫోజులు ఇస్తాడు. దీంతో పక్కనున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. కొందరు యువతులు ఇతన్ని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. అయినా అతడు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ‘‘మా ట్యాంక్‌లో నీళ్లు ఖాళీ అయ్యాయి.. ఈ రోజు ఆఫీసులోనే స్నానం చేస్తా’’.. అని ప్రస్తావిస్తూ.. ఈ వీడియోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పనులు చేయడానికి చాలా ధైర్యం కావాలి... అంటూ కొందరు, ఎవరైనా టవల్ లాగితే ఏంటి పరిస్థితి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

రైల్లో వెళ్తున్నాడో వ్యక్తి.. స్కూల్‌లో ఉండాల్సిన పక్కింటి పిల్లాడు బోగీలో ప్రత్యక్ష్యం.. ఆరా తీస్తే కంగారు పడుతూనే..

Updated Date - 2022-12-08T19:17:26+05:30 IST