-
-
Home » Prathyekam » Netizens are laughing after seeing the video of the man dancing kjr spl-MRGS-Prathyekam
-
Viral Video: బాబూ.. డాన్స్ ఆపేసి కాస్త వెనక్కి తిరిగి చూస్కో.. నెట్టింట నవ్వులు పేల్చుతున్న వీడియో..!
ABN , First Publish Date - 2022-08-20T22:20:10+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) మానియా నడుస్తోంది. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకూ ప్రతి ఒక్కరూ వీడియోలు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయడం...

ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) మానియా నడుస్తోంది. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకూ ప్రతి ఒక్కరూ వీడియోలు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయడం.. సర్వసాధారమైంది. కొందరైతే అందరికంటే ఫేమస్ కావాలనే ఉద్దేశంతో వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడడం కూడా తరచూ చూస్తున్నాం. స్మార్ట్ చేతిలో ఉంటో చుట్టు పక్కల ఏముందో అన్న విషయం కూడా మర్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నవ్వులు (Comedy videos) పూయిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబూ.. డాన్స్ ఆనేసి కాస్త వెనక్కి తిరిగి చూసుకో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ట్విట్టర్లో (Twitter) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వినూత్నమైన స్టెప్పులు వేసి, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని అనుకుంటాడు. కొత్త రకం స్టెప్పు వేసేందుకు ప్రయత్నిస్తాడు. స్టాండ్‌కు మొబైల్ అమర్చి గోడపైన పెడతాడు. వీడియో ఆన్ చేసి.. వేగంగా వెళ్లి వెనక్కు తిరిగి డ్యాన్స్ (Dance) వేస్తుంటాడు. అయితే అప్పటికే స్టాండ్‌తో సహా మొబైల్.. నీళ్లలో పడిపోతుంది. దీన్ని గమనించని అతను వెనక్కు తిరిగి మెలికలు తిరుగుతూ డ్యాన్స్ వేస్తునే ఉంటాడు. కాసేపు ఆగాక.. తిరిగి చూస్తే మొబైల్ కనిపించదు. దీంతో అవాక్కై... పరుగెత్తుకుంటూ వచ్చి నీళ్లలో చేతులు పెట్టి మొబైల్ కోసం వెతుకుతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.