రాత్రికి రాత్రే ఆ గ్రామ ప్రజలు కోటీశ్వరులయ్యారు.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.7.50కోట్లు జమ!

ABN , First Publish Date - 2022-12-10T12:59:56+05:30 IST

ఒకే ఒక్క అద్భుతం ఆ గ్రామ ప్రజలను ధనికులను చేసేసింది. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా రూ.7.50కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ విలేజ్ ప్రస్తుతం ధనిక గ్రామంగా మారింది. వినడానికి ఏదో సినిమా స్టోరీలా అనిపించినా..

రాత్రికి రాత్రే ఆ గ్రామ ప్రజలు కోటీశ్వరులయ్యారు.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.7.50కోట్లు జమ!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ ఆ గ్రామ ప్రజలంతా సాధారణ జీవితమే గడిపారు. కానీ తాజాగా చోటు చేసుకున్న ఒకే ఒక్క అద్భుతం ఆ గ్రామ ప్రజలను ధనికులను చేసేసింది. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా రూ.7.50కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ విలేజ్ ప్రస్తుతం ధనిక గ్రామంగా మారింది. వినడానికి ఏదో సినిమా స్టోరీలా అనిపించినా.. ఇది మాత్రం పచ్చి నిజం. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ గ్రామం పేరు ఆల్మెన్(Olmen). బెల్జియం(Belgium)లోని బాలెన్ మున్సిపాలిటీలో భాగంగా ఉంటుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా సుమారు 3100 వరకు ఉంది. కాగా.. ఈ గ్రామ ప్రజలను తాజాగా అదృష్టం వరించింది. ఆల్మెన్ గ్రామానికి చెందిన దాదాపు 165 మంది.. ఒక్కొక్కరు కొంత మొత్తాన్ని చందాగా వేసుకుని ఉమ్మడిగా యూరోమిలియన్ లాటరీ టికెట్స్‌ను(EuroMillion Lottery Tickets) కొనుగోలు చేశారు. తాజాగా మంగళవారం రోజున లాటరీ నిర్వాహకులు డ్రా తీశారు. ఈ డ్రాలో వాళ్లు కొనుగోలు చేసిన టికెట్స్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.1200కోట్ల విలువైన నగదును గెలుచుకున్నారు. దీంతో ఒక్కొక్కరి అకౌంట్లో దాదాపు రూ.7.50కోట్లు జమయ్యాయి. దీంతో ఆ 165 మంది ఆనందంతో మునిగిపోయారు. గత కొన్నేళ్లుగా ఇలానే లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఈసారి మాత్రం తమను అదృష్టం వరించిందని సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని ఈ ఏడాది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌గా అభివర్ణించారు.

Updated Date - 2022-12-10T15:31:49+05:30 IST