stray dogs chase: విద్యార్థులను ఛేజింగ్ చేసిన వీధికుక్కలు...ఆపై ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-09-13T14:26:31+05:30 IST

వీధి కుక్కల(stray dogs) గుంపు రోడ్డుపై నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థులను కరిచేందుకు వెంటాడిన ఘటన...

stray dogs chase: విద్యార్థులను ఛేజింగ్ చేసిన వీధికుక్కలు...ఆపై ఏం జరిగిందంటే...

కన్నూర్ (కేరళ): వీధి కుక్కల(stray dogs) గుంపు రోడ్డుపై నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థులను కరిచేందుకు వెంటాడిన ఘటన కేరళ(Kerala) రాష్ట్రంలోని కన్నూర్(Kannur) పట్టణంలో తాజాగా వెలుగుచూసింది. ఇద్దరు విద్యార్థులు(students) రోడ్డుపై నడిచి వస్తుండగా వీధిలో ఉన్న ఆరు కుక్కల గుంపు మొరుగుతూ విద్యార్థులపైకి లంఘించాయి.ఒకేసారి ఆరు కుక్కలు(dogs) వెంటాడుతుండటంతో విద్యార్థులు కాళ్లకు పనిచెప్పి పరుగుతీశారు.(stray dogs chase) తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న ఇద్దరు విద్యార్థులను కుక్కలు మరింత వేగంగా ఛేజింగ్ చేశాయి. విద్యార్థులు పరుగుతీస్తూ రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి గేటు తీసి లోపలకు వెళ్లి గేటు వేశారు. 


అంతే అదృష్టవశాత్తూ రెప్పపాటు కాలంలో కుక్కల దాడి నుంచి ఇద్దరు విద్యార్థులు తప్పించుకున్నారు.(Narrow escape)విద్యార్థులు గేటు లోపల ఉండటంతో బయట కుక్కలు మొరుగుతూ(dogs continued barking) అక్కడే పాగా వేశాయి. దీంతో విద్యార్థులు ఆ ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.అనంతరం రోడ్డుపైనే భైఠాయించిన వీధి కుక్కలు మరో మహిళ ఇంటికి వెళుతుండగా ఆమె వెంట కూడా పడటంతో ఆమె పరుగులంకించుకుంది. వీధికుక్కలతో జర జాగ్రత్త... విద్యార్థులను ఛేజింగ్ చేసిన వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇంకెందుకు ఆలస్యం కుక్కల ఛేజింగ్ వీడియోను మీరూ చూడండి...




Updated Date - 2022-09-13T14:26:31+05:30 IST