Mumbai Police: పదో తరగతి ఫలితాల గురించి టెన్షన్ పడుతున్న విద్యార్థికి ముంబై పోలీసుల రిప్లై ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-19T21:09:32+05:30 IST

ప్రతి విద్యార్థి జీవితంలోనూ ఫలితాల వెలువడే రోజు అత్యంత ఆందోళనకరంగా ఉంటుంది.

Mumbai Police: పదో తరగతి ఫలితాల గురించి టెన్షన్ పడుతున్న విద్యార్థికి ముంబై పోలీసుల రిప్లై ఏంటంటే..

ప్రతి విద్యార్థి జీవితంలోనూ ఫలితాల వెలువడే రోజు అత్యంత ఆందోళనకరంగా ఉంటుంది. పరీక్షల్లో సాధించే మార్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఫలితాల కోసం ప్రతి విద్యార్థి టెన్షన్ టెన్షన్‌గా ఎదురుచూస్తుంటాడు. ICSE బోర్డ్ 10వ తరగతి ఫలితాల కోసం టెన్షన్ టెన్షన్‌గా ఎదురు చూస్తున్న ధ్రువ్ అనే విద్యార్థికి ముంబై పోలీసులు బాసటగా నిలిచారు. పరీక్ష ఫలితాల గురించి ఎక్కువ భయపడవద్దంటూ బాలుడికి వారు ఇచ్చిన సమాధానం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.


ఇది కూడా చదవండి..

X Ray Machines కు కూడా చిక్కలేదు.. అయినా అనుమానంతో ఈ Beauty Creams ను కత్తిరించి చూస్తే..


ధ్రువ్ అనే ట్విటర్ యూజర్ జూలై 17న మహారాష్ట్ర డీజీపీని, ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ.. `@DGPMaharashtra @MumbaiPolice ఈ రోజు నా ICSE ఫలితాలు. నాకు చాలా భయంగా ఉంద`ని ట్వీట్ చేశాడు. ఆ బాలుడి ట్వీట్‌కు ముంబై పోలీసులు స్పందిస్తూ.. `హే ధ్రువ్, నీ ఫలితాల గురించి చింతించకు. పరీక్ష అనేది ఒక ప్రయాణం మాత్రమే. అది నీ గమ్యం కాదు. ఇతర పరీక్షల మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. నీ సామర్థ్యంపై నువ్వు నమ్మకం ఉంచు. ICSE ఫలితాలకు బెస్ట్ ఆఫ్ లక్` అని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. ముంబై పోలీసుల స్పందన పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, గత ఆదివారం ICSE ఫలితాలు విడుదలయ్యాయి. 



Updated Date - 2022-07-19T21:09:32+05:30 IST