Mrunal Takur: హీరోయిన్‌ అయితే.. అలా చేయకూడదా?

ABN , First Publish Date - 2022-12-06T17:13:25+05:30 IST

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు మృణాల్‌ ఠాకుర్‌. తెలుగులో మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. అందం, అభినయం, అమాయకత్వం కలగలిసిన ఈ బ్యూటీని ‘సీతారామం’ చిత్రంలో సీతగా కురచ దుస్తుల్లో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేనట్లుగా కనిపిస్తోంది.

Mrunal Takur: హీరోయిన్‌ అయితే.. అలా చేయకూడదా?


‘సీతారామం’ (Sita ramam)సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు మృణాల్‌ ఠాకుర్‌ (Mrunal takur). తెలుగులో మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. అందం, అభినయం, అమాయకత్వం కలగలిసిన ఈ బ్యూటీని ‘సీతారామం’ చిత్రంలో సీతగా కురచ దుస్తుల్లో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేనట్లుగా కనిపిస్తోంది. అందుకు కారణం ఈ మధ్యకాలంలో ఆమె హాట్‌హాట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలే. ఆ ఫొటోలను వీక్షించిన నెటిజన్లు... ‘నిన్ను సీతగానే చూడాలనుకుంటున్నాం. ఇలా స్కిన్‌ షో చేయడం అభిమానులుగా మాకు నచ్చడం లేదు’ అంటూ కామెంట్లు చేశారు. విపరీతంగా ట్రోలింగ్‌ కూడా జరిగింది. అయితే దీనిపై మృణాల్‌ ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఆమె మరో విషయంపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీలో ‘పిప్పా’ అనే సినిమా చేస్తునట్లు తెలిపారు. అందులో ఆమె హీరోకి చెల్లెలిగా నటించనుంది. ఆ హీరో  ఎవరో కాదు ఇషాన్‌ ఖట్టర్‌. యుద్థం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం కథ నచ్చడం వల్ల ఓకే చెప్పాను’’ అని తెలిపారు. ఇప్పుడు సోదరిగా నటిస్తున్న మీరు ఇకపై హీరోల పక్కన నటించరా? అంటూ తనని ట్రోల్‌ చేస్తున్నారని తెలిపింది. ఆమె ట్రోల్స్‌పై అక్క, తల్లి, వదిన లాంటి క్యారెక్టర్స్‌ చేయకూడదా?స్పందిస్తూ మండిపడ్డారు. ‘‘హీరోయిన్లు.. హీరోయిన్లుగానే చెయ్యాలా?  ఇలాంటి రెగ్యులర్‌ ఫార్మెట్‌ని బ్రేక్‌ చేసినప్పుడే మనలో సత్తా ఏంటో తెలుస్తుంది. కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకుంటే.. ఓ గొప్ప పాత్ర మిస్‌ చేసుకున్నాననే అన్న బాధ ఉండోద్దు. అందుకే ఈ క్యారెక్టర్‌ నచ్చి చెల్లెలి పాత్ర అంగీకరించా ఒకే చేశాను’ అంటూ ఘాటుగా ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇచ్చింది. 


Updated Date - 2022-12-06T17:22:03+05:30 IST