19 ఏళ్ల కూతురికి మూగ, చెవుడు.. ఒంటరిగా ఇంట్లో ఉంచి పొలానికి వెళ్లడమే ఆ తల్లి తప్పయింది.. తిరిగొచ్చేసరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-10-04T20:35:29+05:30 IST

ఆ యువతి వయసు 19 సంవత్సరాలు.. ఆ యువతి మాట్లాడలేదు, వినలేదు, మానసిక సమస్యలతో కూడా బాధపడుతోంది..

19 ఏళ్ల కూతురికి మూగ, చెవుడు.. ఒంటరిగా ఇంట్లో ఉంచి పొలానికి వెళ్లడమే ఆ తల్లి తప్పయింది.. తిరిగొచ్చేసరికి ఏం జరిగిందంటే..

ఆ యువతి వయసు 19 సంవత్సరాలు.. ఆ యువతి మాట్లాడలేదు, వినలేదు, మానసిక సమస్యలతో కూడా బాధపడుతోంది.. తల్లి ఆ యువతిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.. ఆదివారం మధ్యాహ్నం ఆ యువతి తల్లి పొలం పనుల కోసం వెళ్లింది.. ఆమె తిరిగి వచ్చే సరికి కూతురి బట్టలు చిందరవందరగా కనిపించాయి.. కూతురిపై ఏదో అఘాయిత్యం జరిగినట్టు భావించిన తల్లి ఇరుగుపొరుగు వారిని అడిగింది.. చివరకు అసలు విషయం బయటపడింది.. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఇది కూడా చదవండి..

హాస్టల్‌లో రాత్రి 10 గంటలకు బాత్రూంకు వెళ్లాడో విద్యార్థి.. మరుక్షణంలోనే భయంతో కేకలు.. ఇంతకీ లోపల ఏం కనిపించిందంటే..


రాజస్థాన్‌లోని అల్వార్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దివ్యాంగురాలిపై పొరుగింట్లో ఉండే 60 ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న మానసిక వికలాంగురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలం పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన తల్లి కూతురిని చూసి షాకైంది. ఏదో జరిగిందని అర్థమైంది. వెంటనే పొరుగింటి వారిని అడిగింది. పక్కింటి వ్యక్తి మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి వెళ్లినట్టు వారు చెప్పారు. దీంతో బాధితురాలి తల్లి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ 60 ఏళ్ల వ్యక్తిని పిలిచి విచారించగా అతను నిజం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలి పొరుగింట్లో ఉంటాడు. నిందితుడికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలాగే నలుగురు మనవలు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. అత్యాచార బాధితురాలి వయస్సు నిందితుడి మనవరాలి వయస్సు ఉంటుంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

Read more