Viral Video: తల్లి డ్యాన్స్ చేస్తుండగా రికార్డు చేసిన కొడుకు.. కానీ, అసలు విషయమేంటంటే..

ABN , First Publish Date - 2022-11-15T18:33:57+05:30 IST

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ చిన్నారి రియాక్షన్స్ నెటిజన్లను ఫిదా చేశాయి.

Viral Video: తల్లి డ్యాన్స్ చేస్తుండగా రికార్డు చేసిన కొడుకు.. కానీ, అసలు విషయమేంటంటే..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరమైనవి ఉంటే, మరికొన్ని ఫన్నీ వీడియోలు ఉంటున్నాయి. అవన్నీ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ చిన్నారి రియాక్షన్స్ నెటిజన్లను ఫిదా చేశాయి. ఆ కుర్రాడు తన తల్లి డ్యాన్స్ చేస్తుండగా వీడియో రికార్డు చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ మహిళ తన కొడుకుపై చిన్న ట్రిక్ ఉపయోగించింది.

ఈ వీడియోను jchavezz_ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ బాలుడు ఫోన్‌ పట్టుకుని, తన తల్లి డ్యాన్స్ రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఆ ఫోన్ కెమెరా తల్లి వైపు కాకుండా ఆ బాలుడి వైపు ఉంది. తన తల్లి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ కుర్రాడి రియాక్షన్స్ ఆ ఫోన్‌లో రికార్డు అయ్యాయి. తల్లి డ్యాన్స్ చేస్తుండగా బాలుడి కళ్లు ప్రకాశవంతంగా మారాయి. మొహంపై చిరునవ్వు విరిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియో 19 లక్షలకు పైగా వ్యూస్‌ను, 1.5 లక్షల లైక్‌లను సంపాదించింది.

Updated Date - 2022-11-15T18:34:02+05:30 IST