ఉపాధి నిమిత్తం వేరే నగరంలో భర్త.. ఇద్దరు పిల్లల గొంతులు కోసి.. ఓ భార్య బలవన్మరణం.. ఆ రాత్రి అసలేం జరిగింది..?

ABN , First Publish Date - 2022-09-20T22:28:25+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అమేథీలో ఒక తల్లి ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేసింది.

ఉపాధి నిమిత్తం వేరే నగరంలో భర్త.. ఇద్దరు పిల్లల గొంతులు కోసి.. ఓ భార్య బలవన్మరణం.. ఆ రాత్రి అసలేం జరిగింది..?

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అమేథీలో ఒక తల్లి ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేసింది. అనంతరం తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కుటుంబంలోని తరచుగా గొడవలు జరుగుతుండడం, భర్త దూరంగా వేరే ఊరిలో ఉండడంతో మనస్తాపం చెందిన మహిళ ఈ దారుణానికి పాల్పడింది. 


ఇది కూడా చదవండి..

నాకెవరూ లేరు.. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతోనే ఉంటానంటే సరేనన్నాడా వ్యక్తి.. రెండో పెళ్లి చేసుకున్న 39వ రోజే..


అమేథీకి సమీపంలోని శివతంగంజ్‌కు చెందిన ధరమ్‌రాజ్ లక్నోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య షీత్లా దేవి (40) తన ఇద్దరు పిల్లలు నిధి (6), నితీష్ (4)లతో కలిసి అత్తగారి వద్ద ఉంటోంది. ప్రతిరోజూ ఏదో విషయమై అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి కూడా అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమె భర్తకు ఫోన్ చేసింది. భర్తతో కూడా గొడవ పడింది. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురై పిల్లలిద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్లింది. 


ఇంటి తలుపు వేసి లోపల పిల్లలిద్దరి గొంతులూ కోసేసింది. అనంతరం తను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం ఎంతసేపటికీ వాళ్లు బయటకు రాలేదు. అత్తగారు తలుపు తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వారికి విషయం చెప్పి బలవంతంగా తలుపులు తెరిపించింది. లోపల ఉన్న మృతదేహాలను చూసి అందరూ షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 

Read more