తల పగిలిందంటూ రెండున్నరేళ్ల పాపను ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. బాలిక ఒంటిపై పాతగాయాలను డాక్టర్లు చూసి నివ్వెరపోయి..

ABN , First Publish Date - 2022-02-23T22:40:28+05:30 IST

ఆమె తన రెండున్నరేళ్ల పాపను తీసుకుని హస్పిటల్‌కు వెళ్లింది.. తలపై గాయం అయిందని చెప్పి చికిత్స చేయమని అడిగింది.

తల పగిలిందంటూ రెండున్నరేళ్ల పాపను ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. బాలిక ఒంటిపై పాతగాయాలను డాక్టర్లు చూసి నివ్వెరపోయి..

ఆమె తన రెండున్నరేళ్ల పాపను తీసుకుని హస్పిటల్‌కు వెళ్లింది.. తలపై గాయం అయిందని చెప్పి చికిత్స చేయమని అడిగింది.. పాప ఒంటి మీద ఉన్న గాయాలను చూసి వైద్యులు నివ్వెరపోయారు.. ఆ చిన్నారికి సీటీ, ఎమ్‌ఆర్ఐ స్కాన్లు తీశారు.. ఆ పాపను శారీరకంగా ఎవరో వేధిస్తున్నట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


కోలెంచెరి మెడికల్ కాలేజీకి మూడ్రోజుల కిందట రెండున్నరేళ్ల పాపను తీసుకుని ఓ మహిళ వచ్చింది. తలపై గాయమైందని చెప్పి చికిత్స చేయమంది. పాప ఆడుకుంటుండగా దెబ్బ తగిలిందని చెప్పింది. అయితే ఆమె చెప్పిన కారణం వైద్యులుకు సంతృప్తి కలిగించలేదు. ఆ చిన్నారి ఒంటిపై చాలా గాయాలున్నాయి. కొన్ని మానిపోయిన గాయాలు కూడా కనిపించాయి. వెంటనే ఆ చిన్నారికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. 


ఆ చిన్నారి శారీరక వేధింపులకు గురైనట్టు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ చిన్నారి తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆమెపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 


Updated Date - 2022-02-23T22:40:28+05:30 IST