Monkey Drinks Alcohol: ఒక చేతిలో మందు గ్లాస్.. మరొక చేతిలో చిప్స్ ప్యాకెట్.. ఎంజాయ్ చేసిన కోతి

ABN , First Publish Date - 2022-11-18T19:45:51+05:30 IST

మధ్యప్రదేశ్​ శివపురిలో ఓ కోతి హల్​చల్ చేసింది. మద్యం సేవిస్తున్న వ్యక్తులపై దాడి చేసి వారిని తరిమేసి తానే మందు తాగేసింది. పక్కనే ఉన్న చిప్స్ ప్యాకెట్ చింపి చక్కగా ఆరగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Monkey Drinks Alcohol: ఒక చేతిలో మందు గ్లాస్.. మరొక చేతిలో చిప్స్ ప్యాకెట్.. ఎంజాయ్ చేసిన కోతి

మధ్యప్రదేశ్​ శివపురిలో ఓ కోతి హల్​చల్ చేసింది. మద్యం సేవిస్తున్న వ్యక్తులపై దాడి చేసి వారిని తరిమేసి తానే మందు తాగేసింది. పక్కనే ఉన్న చిప్స్ ప్యాకెట్ చింపి చక్కగా ఆరగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి శివపురిలో ప్రజలు చాలా రోజులుగా కోతులతో బాధలు పడుతున్నారు. రోడ్ల పైన తిరుగుతూ ఇళ్లలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి.

బైక్​పై వెళ్తున్నవారితో పాటు పాదచారులపై వానరలు దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. అంతేకాదు రాయ్‌బరేలీ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒక కోతి నేరుగా బార్‌లోకి ప్రవేశించి ఓ వ్యక్తి చేతిలో నుంచి బలవంతంగా బీరు లాక్కుని తాగేసింది. కోతి మూక వల్ల చాలా మంది వినియోగదారులు తన బార్‌కు రావడం లేదని బార్ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Updated Date - 2022-11-18T19:45:52+05:30 IST