అతను గేదెలను కడిగే తీరుకు ఆమె ముగ్ధురాలైంది... పాల దిగుబడి పెరగడంతో అతనికి ప్రపోజ్ చేసింది... తరువాత?

ABN , First Publish Date - 2022-10-01T14:19:23+05:30 IST

20 ఏళ్ల యువతి తన ఇంటిలోని పనివాడి ప్రేమలో పడింది.

అతను గేదెలను కడిగే తీరుకు ఆమె ముగ్ధురాలైంది... పాల దిగుబడి పెరగడంతో అతనికి ప్రపోజ్ చేసింది... తరువాత?

20 ఏళ్ల యువతి తన ఇంటిలోని పనివాడి ప్రేమలో పడింది. అతనిని తన ఇంటిలోని జంతువులను సంరక్షించేందుకు నియమించింది. అయితే ఆ అమ్మాయి అతని నిజాయితీకి మెచ్చి, పెళ్లికి ప్రపోజ్ చేసింది. ప్రేమలో చిన్నా, పెద్దా, ధనిక, పేద అనే తేడాలేవీ ఉండవని ఆ అమ్మాయి చెబుతోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన ఆ యవతి పేరు ముస్కాన్. 25 ఏళ్ల అమీర్‌తో తాను ఎలా ప్రేమలో పడ్డానో ఒక యూట్యూబ్ వీడియోలో ఆమె చెప్పింది. ఆమె తన ఇంటిలోని గేదెల సంరక్షణ కోసం అమీర్‌ను నియమించుకుంది. తమ ఇంటిలో నాలుగు గేదెలు ఉన్నాయని, వాటి సంరక్షణ కోసం అమీర్‌ను నియమించుకున్నారని ముస్కాన్ తెలిపింది. అమీర్ చాలా నిజాయితీపరుడు. తనకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేసేవాడు. అతను వచ్చిన తరువాత, ముస్కాన్ ఇంటిలోని గేదెలు అధికంగా పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. దీంతో ముస్కాన్ అతని పనితీరుకు ముగ్ధురాలయ్యింది. క్రమంగా ఆమె అమీర్‌పై ఇష్టాన్ని పెంచుకుంది. ఆమె అమీర్‌తో తన మనసులోని మాట చెప్పాలని నిర్ణయించుకుంది. ఒకరోజు అమీర్ గేదెలకు స్నానం చేయిస్తుండగా, ముస్కాన్ అమీర్‌కి ప్రపోజ్ చేసింది. ’నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ఈ మాట విన్న అమీర్ ఒక్క క్షణం షాక్‌నకు గురయ్యాడు. సమాధానం చెప్పేందుకు సాయంత్రం వరకు గడువు అడిగాడు. సాయంత్రానికల్లా అమీర్ తన కుటుంబ సభ్యుల అభిప్రాయం తెలుసుకుని, ముస్కాన్‌తో వివాహానికి అంగీకరించాడు. 20 ఏళ్ల ముస్కాన్ తన తల్లితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ముస్కాన్ పనివాడిని పెళ్లి చేసుకోవడంపై ఆమె తల్లి కూడా అభ్యంతరం చెప్పలేదు. అమీర్‌ని పెళ్లి చేసుకున్న ముస్కాన్ గేదెల సంరక్షణ కోసం మరో ముగ్గురిని నియమించుకుంది. ముస్కాన్‌ను పెళ్లి చేసుకోవడం ద్వారా తనకు జీవితంలో అన్నీ దక్కాయని అమీర్ చెప్పాడు. Read more