తల్లిదండ్రుల మీద కోపంతో ఇంటి నుంచి పారిపోయిన 14 ఏళ్ల బాలిక.. 20 రోజుల పాటు ఆమె ఎంతటి నరకం అనుభవించిందంటే..

ABN , First Publish Date - 2022-07-17T21:11:44+05:30 IST

14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులపై కోపంతో ఇంటి నుంచి పారిపోయింది..

తల్లిదండ్రుల మీద కోపంతో ఇంటి నుంచి పారిపోయిన 14 ఏళ్ల బాలిక.. 20 రోజుల పాటు ఆమె ఎంతటి నరకం అనుభవించిందంటే..

14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులపై కోపంతో ఇంటి నుంచి పారిపోయింది.. బస్సులో ప్రయాణిస్తున్న ఆ బాలికపై ఓ వ్యక్తి కన్ను పడింది.. సహాయం చేస్తాననే సాకుతో అతను ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత మరొక వ్యక్తికి అమ్మేశాడు. అతడు కూడా ఆ బాలికపై అత్యాచారం చేశాడు. 20 రోజుల నరక యాతన తర్వాత ఆ బాలికను పోలీసులు విడిపించారు.. మైనర్‌ను అత్యాచారం చేసి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Uttar pradesh: చిన్న పిల్లాడిలా ఏడ్చిన పోలీస్ అధికారి.. కారణమేంటో తెలిస్తే షాక్!


రాజస్థాన్‌లోని ముహనాలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలిక జూన్ 26 ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా కూతురి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ టీమ్ సహాయం తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి బాలిక భరత్‌పూర్‌ వెళ్లినట్టు తెలుసుకున్నారు. దేవ్‌పాల్‌ అనే వ్యక్తితో బాలిక వెళ్లడం గమనించి అతడిని పట్టుకున్నారు. అతడి ద్వారా మొత్తం విషయం తెలుసుకున్నారు. రూ.5000కు బబ్లూ అనే వ్యక్తికి ఆ బాలికను అమ్మేసినట్టు తెలుసుకున్నారు. 


దేవపాల్ చెప్పిన వివరాల ఆధారంగా హిందౌన్ సిటీలోని ఓ ఇంట్లో ఉన్న బాలికను పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను జైపూర్ తరలించారు. దేవపాల్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బబ్లూ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. 

Read more