అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక.. బంగారు నగలు, డబ్బు తీసుకుని..

ABN , First Publish Date - 2022-08-02T22:09:53+05:30 IST

ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు.. 12వ తరగతి చదువుతోంది.. మంగళవారం ఉదయం నిద్ర లేచి చూసే సరికి

అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక.. బంగారు నగలు, డబ్బు తీసుకుని..

ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు.. 12వ తరగతి చదువుతోంది.. మంగళవారం ఉదయం నిద్ర లేచి చూసే సరికి ఆమె ఇంట్లో కనిపించలేదు.. గ్రామంలోని, చుట్టుపక్కల వారి ఇళ్లలో కూడా ఆమె ఆచూకీ లేదు.. ఇంట్లో చూడగా రూ.7 వేల నగదు, చెక్ బుక్, బంగారు నగలు మాయమయ్యాయి.. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బాలిక సోదరుడి అనుమానం మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Viral News: గ్రాండ్‌గా విడాకుల పార్టీ చేసుకున్న మహిళ.. ఆ పార్టీకి వచ్చిన వెయిటర్‌ను చూసి..


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలోని బదియా గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతూ రూ.7 వేల నగదు, చెక్ బుక్, బంగార నగలు తీసుకెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. బాలిక సోదరుడు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆ యువకుడు కూడా గ్రామంలో కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిద్దరి కోసం గాలిస్తున్నారు. 

Read more