యుద్ధ కళలో బామ్మ నైపుణ్యం.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు!

ABN , First Publish Date - 2022-06-26T14:35:34+05:30 IST

చురుకుదనానికి మరో పేరు మార్షల్ ఆర్ట్స్...

యుద్ధ కళలో బామ్మ నైపుణ్యం.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు!

చురుకుదనానికి మరో పేరు మార్షల్ ఆర్ట్స్. ఈ కళకు దేహంలో శక్తి అవసరమని నమ్ముతారు. అయితే కేరళకు చెందిన మీనాక్షి అమ్మ అలాంటి భావాలను వెనక్కునెట్టేసి ప్రపంచం ముందు కొత్త ఉదాహరణగా నిలిచారు. మీనాక్షి అమ్మ భారతదేశంలోని పురాతన కలరిపయట్టు యుద్ధ నైపుణ్యాలను చాలా ఏళ్లుగా ఉచితంగా నేర్పుతున్నారు. మీనాక్షి అమ్మ 81 సంవత్సరాల వయస్సులో దేశంలోని తరువాతి తరానికి యుద్ధ కళలను బోధిస్తున్నారు. భారతదేశంలోని పురాతన కలరిపయట్టు పోరాట నైపుణ్యాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఈ కళను పిల్లలకు ఉచితంగా నేర్పించాలనే ఆమె అభిరుచికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2017లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 


తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి కలరి నేర్చుకుంటున్నానని మీనాక్షి అమ్మ తెలిపారు. దీనికి కుటుంబ సభ్యులు మద్దతు ఉన్నదన్నారు. తన తండ్రి ఈ కళను దేవుడిచ్చిన బహుమతిగా భావించారని, ఇప్పుడు తాను ఈ కళను దేశ భవిష్యత్తుకు అందించాలనుకుంటున్నాను. తద్వారా రాబోయే సంవత్సరాల్లో కూడా మన సంస్కృతి సజీవంగా ఉంటుందన్నారు. ఇక్కడ మంచి విషయమేమిటంటే పిల్లలు కూడా దానిపై ఆసక్తి చూపుతున్నారన్నారు. దేశంలోని ఆడపిల్లలు కలరిపయట్టు నేర్చుకోవాలని మీనాక్షి అమ్మ సూచించారు. ఇది వారి ఆత్మరక్షణలో సహాయపడుతుందన్నారు. ఆమె అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు. 


Updated Date - 2022-06-26T14:35:34+05:30 IST