అన్నంలో విషం పెట్టారన్న తల్లిదండ్రులు.. అనారోగ్యంతోనే చనిపోయిందన్న అత్తమామలు.. పెళ్లయిన 6 నెలలకే ఘోరం వెనుక..

ABN , First Publish Date - 2022-10-06T22:46:30+05:30 IST

ఆ యువతి కళాశాలలో చదువుతున్నప్పుడే ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడిని వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది..

అన్నంలో విషం పెట్టారన్న తల్లిదండ్రులు.. అనారోగ్యంతోనే చనిపోయిందన్న అత్తమామలు.. పెళ్లయిన 6 నెలలకే ఘోరం వెనుక..

ఆ యువతి కళాశాలలో చదువుతున్నప్పుడే ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత పెద్దలు వారి పెళ్లిని అంగీకరించడంతో అత్తింటికి వెళ్లింది.. అయితే ఆరు నెలలు తిరగక ముందే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.. తమ కూతురిని అత్తమామలు విషం పెట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. అనారోగ్యం వల్లే కోడలు చనిపోయిందని అత్తమామలు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

Husband Salary: ఎన్నిసార్లు అడిగినా జీతం ఎంతో చెప్పకుండా తప్పించుకుంటున్న భర్త.. విసుగొచ్చి ఆ భార్య చేసిన పనికి అంతా షాక్..!


హర్యానాలోని కర్నాల్‌కు చెందిన కోమల్ (20) ఈ ఏడాది ఏప్రిల్‌లో గుల్షన్ అనే యువకుడితో వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి ఆమోదం తెలిపారు. తల్లిదండ్రులు సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించి కోమల్‌ని అత్తంటికి పంపించారు. పెళ్లైన ఆరు నెలలకే కోమల్ మృతి చెందింది. బుధవారం ఉదయం ఆమె అనుమానాదస్పద స్థితిలో మరణించింది. కట్నం కోసం వేధిస్తూ భర్త, అత్తమామలు విషపూరిత పదార్థాలు ఇచ్చి హత్య చేశారని కోమల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


కోమల్ చాలా కాలంగా టీబీతో బాధపడుతున్నట్టు అత్తమామలు తెలిపారు. తాము ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. అనారోగ్యం కారణంగానే కోమల్ చనిపోయినట్టు అత్తమామలు చెబుతున్నారు. కాగా, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కోమల్ మృతికి గల కారణాలు తెలియనున్నాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Read more