Viral Video: రోడ్డుపై ఓ వ్యక్తి బ్రేక్ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2022-07-11T21:22:17+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారి ట్యాలెంట్ కూడా అందరికీ చేరువవుతోంది.

Viral Video: రోడ్డుపై ఓ వ్యక్తి బ్రేక్ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారి ట్యాలెంట్ కూడా అందరికీ చేరువవుతోంది. మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. లుంగీ, షర్టు వేసుకున్న ఓ వ్యక్తి రోడ్డుపై చేసిన బ్రేక్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాజ్‌కుమార్ అనే వ్యక్తి  ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 


Gentleman సినిమాలోని `చికు బుకు చికు బుకు రైలే` పాటకు రమేష్ అనే వ్యక్తి డ్యాన్స్ వేశాడు. చెప్పులు, లుంగీ, షర్టు వేసుకుని రాత్రి పూట రోడ్డుపై చాలా స్టైలిష్‌గా డ్యాన్స్ చేశాడు. మూన్ వాక్ కూడా చేశాడు. ఈ వీడియో ఇప్పటికి కోటికి పైగా వ్యూస్ సాధించింది. పది లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. పలువురు సెలబ్రిటీలు కూడా రమేష్ డ్యాన్స్‌ను ప్రశంసించారు.  

Updated Date - 2022-07-11T21:22:17+05:30 IST