-
-
Home » Prathyekam » Man wants all his gifts back from Exgirl friend here is the reason sgr spl-MRGS-Prathyekam
-
Malaysia: మాజీ ప్రియుడు గిఫ్ట్‌గా ఇచ్చిన కారులో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతున్న యువతి.. ఆ తర్వాత ఏమైందంటే..
ABN , First Publish Date - 2022-09-04T21:40:06+05:30 IST
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. తొమ్మిదేళ్ల పాటు సహజీవనం చేశారు.. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. తొమ్మిదేళ్ల పాటు సహజీవనం చేశారు.. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు.. ప్రియురాలికి ప్రియుడు ఖరీదైన బహుమతులు ఇచ్చాడు.. ఆమెకు ఏకంగా కారు కూడా కొనిపెట్టాడు.. అయితే కొద్ది నెలల క్రితం వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు.. అయినా ఆ యువకుడు తన ప్రియురాలికి ఇచ్చిన గిఫ్ట్‌లను వెనక్కి తీసుకోలేదు.. ఏనాటికైనా మనసు మార్చుకుని తన దగ్గరకు వస్తుందని ఆశించాడు.
ఇది కూడా చదవండి..
Viral Video: మనుషులే కాదు.. కోతులు కూడా స్మార్ట్‌ఫోన్‌కు బానిసలే.. వైరల్ అవుతున్న వీడియో!
ఆ యువకుడి మంచి మనసును ఆ యువతి అర్థం చేసుకోలేకపోయింది. ప్రియుడి నుంచి విడిపోగానే మరో యువకుడితో కలిసి తిరగడం ప్రారంభించింది. అంతేకాదు.. తన మాజీ లవర్ ఇచ్చిన కారులో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరగడం మొదలుపెట్టింది. ఆ విషయం మాజీ ప్రియుడికి తెలిసింది. అతను తన మాజీ ప్రియురాలి దగ్గరకు వెళ్లి తన కారు, ఇతరు బహుమతులు తిరిగి ఇచ్చెయ్యాలని అడిగాడు. మలేసియాకు (Malaysia) చెందిన ఆ యువకుడు ఆ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ యువకుడికి మద్దతుగా నిలుస్తున్నారు.