-
-
Home » Prathyekam » Man Tries To Pet Lion Cubs Here What Happened Next sgr spl-MRGS-Prathyekam
-
Viral Video: సింహం పిల్లలతో ఆడుతూ స్టైలిష్‌గా ఫోటోలకు ఫోజులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-10-12T00:34:21+05:30 IST
సింహాలు, పులులు వంటి వన్య మృగాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

సింహాలు, పులులు వంటి వన్య మృగాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుక్కలు, పిల్లుల్లా అవి పెంపుడు జంతువులు కావు. అయినా వాటిని పెంచుకునేందుకు కొందరు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి సందర్భాల్లో అవి యాజమానులకే కాదు.. చట్టుపక్కల వారికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతుంటాయి. అయితే తాజాగా ఒక వ్యక్తి సింహం పిల్లలతో ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక వ్యక్తి రెండు సింహం పిల్లలను కారు మీద ఉంచి వాటితో ఆడుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. కొద్దిసేపు ఆ సింహం పిల్లలు బాగానే వున్నాయి. కొద్ది సేపటి తర్వాత ఒక సింహం పిల్ల అతడిని కరిచేందుకు ప్రయత్నించింది. భయపడి దూరం జరిగిన ఆ వ్యక్తి తిరిగి దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.