ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నం.. సమయానికి వెళ్లి కాపాడిన లేడీ కానిస్టేబుల్..

ABN , First Publish Date - 2022-08-22T18:10:47+05:30 IST

పోలీసులు తమ వృత్తిగత జీవితంలో ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు.

ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నం.. సమయానికి వెళ్లి కాపాడిన లేడీ కానిస్టేబుల్..

పోలీసులు తమ వృత్తిగత జీవితంలో ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. అయినా తమ విధి నిర్వహణలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయరు. గుజరాత్‌ (Gujarat)లో జరిగిన ఓ ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఐదేళ్ల బాలికను కాపాడింది. ఈ ఘటన పాండేసరలోని వడోదరకు సమీపంలో చోటుచేసుకుంది.


ఇది కూడా చదవండి..

Shocking: మద్యం మత్తులో భర్తపై దాడి చేసిన నవ వధువు.. ప్రాణ భయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భర్త!


వడోదరకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన పక్కింట్లో ఉండే ఐదేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశ చూపించి రోడ్డు పక్క పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యకర పనులు చేయిస్తున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో లేడీ కానిస్టేబుల్ సుహానీ డ్యూటీకి వెళ్తోంది. అనుకోకుండా ఆమె దృష్టి పొదల వెనుక ఐదేళ్ల బాలికతో ఉన్న వ్యక్తిపై పడ్డాయి. ఆమెకు అనుమానం వచ్చి వెంటనే అక్కడకు చేరుకుంది. బాలికను నగ్నంగా మార్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు నిందితుడు సిద్ధమవుతున్నాడు. 


సుహానీ వెంటనే ఆ బాలికను రక్షించి స్థానికుల సహాయంతో నిందితుడిని పట్టుకుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read more