‘నన్ను పెళ్లి చేసుకో’... అమ్మాయి ‘నో’ చెప్పగానే... ఆ యువకుడు ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-09-27T18:13:27+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో వన్‌సైడ్ లవ్‌లో...

‘నన్ను పెళ్లి చేసుకో’... అమ్మాయి ‘నో’ చెప్పగానే... ఆ యువకుడు ఏం చేశాడంటే...

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో వన్‌సైడ్ లవ్‌లో మునిగిన యువకుడు ఒక యువతి ఎదుట తొలుత మారణాయుధాలతో తనపై తానే దాడి చేసుకున్నాడు. తరువాత ఆ యువతిపై దాడి చేసి, ఆమెను గాయపరిచాడు. ఈ ఉదంతం మాంట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా యువకుడి దాడిలో గాయపడిన యువతికి చికిత్స చేసిన అనంతరం ఇంటికి తరలించారు. 


మీడియాకు అందిన వివరాల ప్రకారం నగ్లా గ్రామానికి చెందిన ఒక యువకుడు వృత్తి రీత్యా డ్రైవర్. అతను తన ఇంటి పొరుగున ఉన్న యువతిని వన్‌సైడ్ లవ్ చేశాడు. ఆ యువతి ముందు పలుమార్లు ప్రపోజ్ చేశాడు. అయితే ఆమె అతనిని ప్రేమించేందుకు నిరాకరించింది. ఆ యువకుడు తాజాగా మరోమారు ఆమె ముందు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే ఆ యువతి ఎప్పటి మాదిరిగానే ఆమె అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు ఆగ్రహానికిలోనై మారణాయుధంతో తనను తాను గాయపరచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ యువతిపైన కూడా దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి పరుగుపరుగున వచ్చారు. ఆ యువతీ యువకులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ యువకుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ యువతికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా ఆ యువకుని తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఏ కారణంగా దాడికి పాల్పడ్డాడో తనకు తెలియదన్నారు.



Read more