South Korea: మాజీ గాళ్‌ఫ్రెండ్ బ్యాగ్‌లో మూత్రం పోసిన వ్యక్తి.. కోర్టు అతనికి ఎలాంటి శిక్ష విధించిందంటే..

ABN , First Publish Date - 2022-08-21T21:48:15+05:30 IST

ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిపై మరొకరికి ఎనలేని ఆప్యాయత, ఇష్టం ఏర్పడతాయి.

South Korea: మాజీ గాళ్‌ఫ్రెండ్ బ్యాగ్‌లో మూత్రం పోసిన వ్యక్తి.. కోర్టు అతనికి ఎలాంటి శిక్ష విధించిందంటే..

ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిపై మరొకరికి ఎనలేని ఆప్యాయత, ఇష్టం ఏర్పడతాయి. బ్రేకప్ చెప్పుకోగానే ఒకరికి ఒకరు శత్రువులుగా మారిపోతారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లిపోతారు. దక్షిణ కొరియా (South Korea)కు చెందిన ఓ యువకుడు తనకు బ్రేకప్ చెప్పిన యువతిపై పగతో రగిలిపోయాడు. ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ప్రేయసికి చెందిన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌లో మూత్రం పోశాడు. చివరకు జరిమానా కట్టి బయటపట్టాడు. 


ఇది కూడా చదవండి..

Shocking: ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు వీడియో కాల్.. తీవ్ర మనస్తపానికి గురైన భర్త ఎంత పని చేశాడంటే.. పిల్లలకు విషం తాగించి..


సియోల్ ప్రాంతానికి చెందిన 31ఏళ్ల ఓ యువకుడు ఒక అమ్మాయితో చాలా రోజులు ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ కలిసి తిరిగేవారు. అయితే ఏమైందో ఏమో ఇటీవల ఆ యువకుడికి యువతి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆ యువకుడు కోపంతో రగిలిపోయాడు. తన మాజీ ప్రేయసికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆమె వాడే ఖరీదైన Louis Vuitton హ్యాండ్ బ్యాగ్‌లో మూత్రం పోసేశాడు. అనంతరం సెంట్ పూశాడు. మాజీ ప్రియుడు చేసిన పనిని ఆ యువతి కని పెట్టేసింది. 


అతను చేసిన పనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారించిన న్యాయస్థానం బాయ్‌ఫ్రెండ్‌కు జరిమానా విధించింది.  దాదాపు 90 వేల రూపాయలను ఆ యువతికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral news) మారింది.

Updated Date - 2022-08-21T21:48:15+05:30 IST