Man Moves Large Snake: రోడ్డు మీద బారెడు పాము ఒట్టి చేతులతో ఇతను చేసిన పనికి అందరూ షాక్!!

ABN , First Publish Date - 2022-09-30T21:28:42+05:30 IST

బారెడు పొడవు, బెండెడు బరువున్న పామును భయం లేకుండా తీసేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలో కదా!!

Man Moves Large Snake: రోడ్డు మీద బారెడు పాము ఒట్టి చేతులతో ఇతను చేసిన పనికి అందరూ షాక్!!


విషపురుగులు అంటే అందరికీ పాములే గుర్తొస్తాయి. పామును చూసి పారిపోయేవాళ్ళే ఎక్కువ, అది ఏమీ చేయకపోయినా ముందుగానే భయం పెంచుకుని ఆ భయంతో వచ్చే ఆవేశంలో వాటిని కొట్టి చంపేసేవారు ఎక్కువ. పాము దారికి అడ్డు వస్తే అది అక్కడి నుండి వెళ్ళిపోయేవరకు ఎదురుచూసి ఆ తరువాత ఆ దారిలో వెళతారు అందరూ. కానీ దారికి అడ్డంగా పడుకున్న పామును చక్కగా ఒట్టిచేతులతో పట్టుకుని దాన్ని పక్కకు తప్పించడం, అందులోనూ బారెడు పొడవు, బెండెడు బరువున్న పామును భయం లేకుండా తీసేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలో కదా!!


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్  ఒక వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు మీద వెహికల్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద పాము పడుకుని ఉండటం గమనించాడు. అతను తన వెహికల్ ను ఆపి ఆ పాము దగ్గరకు వెళ్లి దాని తోకను పట్టుకుని తాడును లాగినట్టు లాగి పక్కనే ఉన్న పొదల్లోకి పంపేశాడు. ఇదంతా చూసిన వారి గుండెలు భయంతో అదురుతాయి, శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అకారణంగా వన్యప్రాణులను చంపేస్తున్న నేటికాలంలో ఆ వ్యక్తి చేసిన పనికి ఎంతో మంది అభినందించారు. ప్రవీణ్ కస్వాన్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అడవి ప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరూ చేయాలని అది అందరి కర్తవ్యమని ప్రవీణ్ కస్వాల్ అన్నారు. అందరికీ అంత ధైర్యం ఉండాలి కదా మరి.

Read more